Devara Postponed: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు నుంచి భయపడుతున్న విషయమే జరిగింది. దేవర సినిమా అనుకున్న రిలీజ్ డేట్ నుంచి వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ దేవర అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రపంచం మరిచిపోయిన తీరాలకు సంబంధించిన కథగా ముందు నుంచి ఈ సినిమాని ప్రచారం చేస్తూ వస్తున్నారు మేకర్స్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. వాస్తవానికి సైఫ్ అలీ ఖాన్ కి సర్జరీ అనే విషయం తెలియగానే సినిమా వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం వేరే ఉందని తెలుస్తోంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ 2024 ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టింది. దాని ప్రకారం త్వరలో ఎన్నికల ప్రకటన షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది.
ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఏప్రిల్ 16వ తేదీన ఈ ఎన్నికలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో అటు పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దానికి తోడు ఏప్రిల్ 5వ తేదీన బాలీవుడ్ సినిమాలతో పోటీ ఉంది, ఈద్ కావడంతో అక్కడి థియేటర్లను సంపాదించడం అంత సామాన్యమైన విషయమే కాదు. వార్ 2 కోసం బాలీవుడ్లో పిచ్ రెడీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎన్టీఆర్ థియేటర్లు దొరకకపోతే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం అని ముందే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇలా సమస్యలు చుట్టుముట్టడంతో కొంచెం వెనక్కి వెళితే ఏమీ కాదని సినిమా యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎలక్షన్స్ తో పాటు నార్త్ లో థియేటర్ల అంశం కారణంగా సినిమాని వాయిదా వేశా అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతానికి సినిమా యూనిట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కానీ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక సినిమాను ఆగస్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.