పఠాన్, జవాన్ సినిమాల్లో మెరిసిన దీపికా పడుకోణే రెండు వెయ్యి కోట్ల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ ఇయర్ మరో సాలిడ్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించడానికి రెడీ అయ్యింది దీపికా. హిందీలో ఫ్రాంచైజ్ అనగానే గుర్తొచ్చేది సింగం సీరీస్. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ కి మెయిన్ పిల్లర్ అయిన సింగం సీరీస్ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు సింగం అగైన్ అంటూ అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి సాలిడ్ యాక్షన్ కి రెడీ అయ్యారు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ 2024 ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. ఇదే డేట్ కి పుష్ప 2 రిలీజ్ అవుతున్నా కూడా సింగం అగైన్ మేకర్స్… చాలా కాన్ఫిడెంట్ గా సినిమాని వాయిదా వేయకుండా షూట్ చేస్తున్నారు. సింగం అగైన్ సినిమాలో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ కూడా కనిపించే అవకాశం ఉంది.
సూర్యవన్షీ, సింబా క్యారెక్టర్ ని సింగం సీరీస్ లోకి తెచ్చి సినిమా చేయనున్నాడు రోహిత్ శెట్టి. ఇప్పటికే సూర్యవన్షీ సినిమా ఎండింగ్ లో అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్ ని చూపించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాడు రోహిత్ శెట్టి. ఇప్పుడు లేటెస్ట్ గా సింగం అగైన్ కోసం లేడీ సింగం, సింబా వైఫ్ దీపికా పడుకోణే ని రంగంలోకి దించాడు. దీపికా సింగం అగైన్ సినిమాలో నటిస్తుంది అంటూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేసారు. అయితే ఇప్పటివరకూ వచ్చిన రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో హీరోయిన్స్ నార్మల్ గా ఉండే వారు. వాళ్ళకి సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ ఉండేది కాదు ఈసారి మాత్రం దీపికాని కూడా పోలీస్ చేసి రోహిత్ శెట్టి కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. సింగం అగైన్ సినిమాలో ఒకే ఫ్రేమ్ లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా కలిసి ఫైట్ చేస్తూ కనిపిస్తే నార్త్ ఆడియన్స్ లో జోష్ మాములుగా ఉండదు.
Welcome to my squad @deepikapadukone #SinghamAgain@RSPicturez @jiostudios @RelianceEnt #Cinergy pic.twitter.com/tX1CDmnJXq
— Ajay Devgn (@ajaydevgn) October 15, 2023