Deekshith Shetty to do another telugu movie: దసరా సినిమాలో నాని స్నేహితుడు పాత్రలో నటించిన హీరో దీక్షిత్ శెట్టి ఆ సినిమాలో తనదైన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూరి పాత్రలో తాను చేసిన నటన తెలుగు ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. అలాంటి దీక్షిత్ శెట్టి మరో తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ద్వారా కిలారు ప్రేమ్ చంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నట్టు తెలుస్తోంది. అడ్వెంచర్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది. నిజానికి కన్నడలో ప్రస్తుతం దీక్షిత్ శెట్టి పలు సినిమాలు చేస్తున్నారు. అందులో ‘బ్లింక్’ ‘కెటిఎమ్’ ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాలు ఉన్నాయి. దసరా సినిమాతో తెలుగులో వచ్చిన గుర్తింపు నేపథ్యంలో వాటిని తెలుగులో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
MLC Jeevan Reddy : గల్ఫ్ కార్మికుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు
‘దసరా’తో తెలుగులో దీక్షిత్ శెట్టికి మంచి గుర్తింపు వచ్చిందని అందువల్ల, అతడు నటించే కన్నడ సినిమాలు తెలుగులో విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. నిజానికి దసరా సినిమా రిలీజ్ కాక మునుపే దియా అనే సినిమాతో తెలుగువారికి పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు కానీ తెలుగు వారికి మాత్రం బాగా కనెక్ట్ అయింది. కన్నడలో తెరకెక్కి రిలీజ్ అయిన సినిమా అక్కడ సూపర్ హిట్ అవడమే కాదు తెలుగులో కూడా మనోడికి దసరా లాంటి సినిమా అవకాశం తెచ్చిపెట్టింది. ఇక ఆ సినిమా ఇప్పుడు మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతోంది. మరి చూడాలి ఈ సినిమాతో మనోడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు అనేది.