Payal Rajput: అలా చేస్తే ‘అజయ్ భూపతి’ని చంపేస్తా : పాయల్ రాజ్‌పుత్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payal Rajput Exclusive Web Interview for Mangalavaram Movie: ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ తెలుగుకు తనను పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా ‘మంగళవారం’. ఆమెకు జోడీగా ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ నటించగా అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి నిర్మించారు. నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతోన్న సందర్భంగా పాయల్ మీడియాతో మాట్లాడారు.
‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా ఎలా మొదలైంది?
Also Read
‘సార్… నాకు ఒక సినిమా ఇవ్వండి, నాకు ఒక అవకాశం కావాలి’ అని అజయ్ భూపతి వెంట పడ్డా, ‘మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఫోన్ చేస్తా’ అని చెప్పారు. చిన్న చిన్న పాత్రలకు నిన్ను తీసుకోలేనని అన్నారు. ఆయనకు నా పొటెన్షియల్, నా ట్యాలెంట్ తెలుసు, ఆయన నుంచి ఫోన్ రాగానే ఓకే చేశాను. తెలుగు ఇండస్ట్రీలో ఇది నా టర్నింగ్ పాయింట్, కమ్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నా, ‘మంగళవారం’ విడుదలకు ఎంత ఎగ్జైట్ ఫీలవుతున్నానో అంతే నెర్వస్ గా కూడా ఉంది. అవుటాఫ్ బాక్స్ సినిమా చేశాం, ఇండియాలో ఈ టైపు క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు.
మీ క్యారెక్టర్ తో నెగిటివిటీ ఉంటుందా?
అసలు ఉండదు, ‘మంగళవారం’లో నేను శైలు పాత్రలో నటించా. సినిమా చూశాక ఆ అమ్మాయి మీద మీకు సింపతీ వస్తుంది, సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. చాలా సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం. రెస్పెక్ట్ ఇస్తూ సెన్సిటివిటీతో సినిమా తీశాం.
మీకు స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పుడు ఏమనిపించింది?
అజయ్ భూపతి ని ఈ క్యారెక్టర్ నిజమేనా? అని అడిగా, నేను ఇంటెన్స్, డార్క్ రోల్స్ చేశాను కానీ ఇటువంటి సినిమా, క్యారెక్టర్ చేయలేదు. కథ విన్నాక ‘అజయ్ భూపతి గారితో మళ్ళీ పని చేస్తున్నా’ అని అమ్మకి ఫోన్ చేసి చెప్పా, ‘ఆర్ఎక్స్ 100’తో నన్ను పరిచయం చేశారనో… మరొకటో… అమ్మకి ఆయన అంటే చాలా గౌరవం, ఆయన డైరెక్షన్ కూడా ఇష్టం.
మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
చాలా ఛాలెంజింగ్ రోల్, అందులో నటించడం చాలా కష్టమైంది. రియల్ లైఫ్ లో నాకు, శైలు పాత్రకు 10 పర్సెంట్ కూడా సంబంధం లేదు. ఏం ఆలోచించకుండా ఫ్రీగా షూటింగ్ చేయడానికి రమ్మని చెప్పారు. ఆయనపై నాకు పూర్తి విశ్వాసం ఉంది, చెప్పినట్లు చేశా, సరెండర్ అయిపోయా, క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ కోసం నేను కూడా కొంత రీసెర్చ్ చేశా.
మీ కంటే ముందు 40 మందిని ఆడిషన్ చేశారట!
ఆల్మోస్ట్ 35 మందిని ఆడిషన్ చేసినట్లు ఉన్నారు, అజయ్ భూపతి వెంట పడ్డానని చెప్పాను కదా! మధ్యలో ఫోన్స్ చేసినప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పేవారు. ‘నన్ను ఎందుకు సెలెక్ట్ చేయడం లేదు’ ఛాన్స్ ఇవ్వడం లేదు’ అని కూడా అడిగా, మీరు మళ్ళీ ఛాన్స్ ఇస్తే నా కెరీర్ కి హెల్ప్ అవుతుందని కూడా చెప్పా. చివరకు, ఆడిషన్స్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు.
మీరు మోడ్రన్ గా కనిపిస్తారు. సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు. ఆ లుక్, క్యారెక్టర్ గురించి…
శైలు క్యారెక్టర్ హెయిర్, మేకప్ కోసం ప్రతి రోజూ రెండు గంటలు పట్టింది, మేకప్ కంటే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. షూటింగ్ కంప్లీట్ చేశాక 15 రోజులు దాన్నుంచి బయటకు రాలేదు, మా అమ్మ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నా, చేతి మీద గాట్లు, నా లుక్ చూసి ‘నీకు ఏమైంది?’ అని అమ్మ అడిగింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉన్నావ్ అని చెప్పింది.
ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను లేడీ ప్రొడ్యూసర్ చేశారు. మీకు ఎంత కంఫర్ట్ అనిపించింది?
చాలా కంఫర్టబుల్ అండి. షూటింగ్ టైములో స్వాతి రెడ్డి గునుపాటిని కలవలేదు. కానీ, ఫోన్ లో మాట్లాడా, స్వాతి, సురేష్ వర్మ ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అజనీష్ సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. టాలెంటెడ్ టెక్నీషియన్లు సినిమాకు పని చేశారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎవరు చూడని కథ, క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉంటాయి.
కార్తికేయతో మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు?, మీ ఇద్దరితో అజయ్ భూపతి సినిమా చేయనన్నారు.
ఆ మాట అన్నారా, అంటే చంపేస్తా(నవ్వుతూ) అదేం లేదు. కార్తికేయతో చెప్పా, మళ్ళీ మనం కలిసి సినిమా చేద్దామని! మంచి కథ వస్తే చెబుతానని అన్నారు. అన్నీ కుదరాలి!
ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్టేజి మీద అల్లు అర్జున్ తో సెల్ఫీలు దిగారు. ఆయనతో ఏం మాట్లాడారు?
అల్లు అర్జున్ గారిని కలిసినప్పుడు బ్లష్ అవుతూ ఉన్నా, ‘పాయల్… నిన్ను చూస్తే గర్వంగా ఉంది, నువ్వు ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదని చెప్పారు, ఐయామ్ సో హ్యాపీ.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!