న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా.. భారీ విజయాన్ని అందుకుంది.. దసరా చిత్రంలో విలన్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక దసరా విలన్ మీద వచ్చిన మీమ్స్,ట్రోల్స్ అందరికీ తెలిసిందే. ఒక్క సినిమాతోనే షైన్ టామ్ తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.. ఆన్ స్క్రీన్ లో చాలా కోపంగా భయంకరమైన విలన్ గా కనిపించాడు.. ఆ సినిమా కు హైలెట్ అయ్యాడు… తెర మీద రెచ్చిపోయిన షైన్ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా ఫన్నీగా ఉంటాడు.. అందుకు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
గతంలో ఓ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో చూశాం.. ఆ వీడియో చూసుకోకుండా అలా ముందుకు నడుస్తూనే ఉంటూ.. గ్లాసు డోర్‌కు గుద్దుకుంటాడు. ఎవ్వరూ చూడ్లేదు కదా అని మెల్లిగా జారుకుంటాడు. ఇక మరోసారి ఫన్నీగా డ్యాన్సులు వేస్తూ కనిపించాడు. అయితే ఇప్పుడు తాజాగా షైన్ టామ్‌కు సంబందించిన మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఆ వీడియో చూస్తుంటే అదొక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లాగా కనిపిస్తుంది.. ఆ ఈవెంట్ లో ఫోటోలు దిగుతున్న సమయంలో కెమెరాలు తనను ఫోకస్ చేస్తున్నాయని అనుకోలేదు. దీంతో జేబులో ఉన్న లైటర్‌ను అనుకోకుండా తీస్తాడు. వామ్మో ఇది వచ్చిందేంటి? ఎవరైనా చూస్తారేమో అన్నట్టుగా వెంటనే లోపల పెట్టేశాడు.. ఆ తర్వాత మళ్లీ తీస్తాడు.. దాంతో కాసేపు ఆడుకుంటాడు.. అతని పక్కన ఉన్న పాపకు చూపించి కాస్త భయపెడతాడు.. కానీ ఆ పాప మాత్రం తన తండ్రి మీదే ఫోకస్ పెట్టింది. ఆ లైటర్ గురించి అంతగా పట్టించుకోలేదు. చివరకు ఆ పాప తండ్రి భుజం మీద చేతులేసి లైటర్ వెలిగించడంతో షాక్ అవుతుంది.. ఈ వీడియోనే నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Orai 😂😂😂😂 pic.twitter.com/dUltbxubb2
— Srinivas (@srinivasrtfan2) February 6, 2024