ప్రస్తుత కాలంలో ఓటీటీ OTT హవా ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమాలు 15–20 రోజుల్లోనే ఓటీటీకి రావడంతో, ప్రేక్షకులు ఇంట్లోనే సినిమాలను ఆనందిస్తున్నారు. దీంతో ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘దక్ష’ OTTలో స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read : Krithi Shetty : కృతిశెట్టి కలల మీద నీళ్లు చల్లిన బాలీవుడ్ !
ఈ కథ రెండు క్లిష్టమైన మర్డర్ మిస్టరీల చుట్టూ తిరుగుతుంది. పోలీస్ సీఐగా పనిచేసే దక్ష (మంచు లక్ష్మి), హైదరాబాద్‌లోని కంటైనర్ యార్డ్‌లో జరిగిన ఒక అనుమానాస్పద మరణాన్ని తన కేసుగా తీసుకుంటుంది. ఇదే సమయంలో, అమెరికా నుంచి వచ్చిన ఒక ఫార్మా కంపెనీ ప్రతినిధి కూడా చనిపోతాడు. రెండు హత్యల్లోనూ ఒకే విధమైన గ్యాస్ ఉపయోగించబడినట్లు దక్ష ఓ క్లూ కనుగొంటుంది.
కేసు పరిష్కారం కోసం దక్ష ఎదుర్కొనే పవర్ఫుల్ ట్విస్టులు, జర్నలిస్ట్ సురేష్ (జెమినీ సురేష్) సేకరించిన కీలక సమాచారతో అసలు కథ మొదలవుతుంది. మరి ఈ హత్యల వెనుక కుట్ర ఏమిటి? దక్ష వ్యక్తిగత జీవితానికి దీనితో సంబంధం ఏంటి? అనేది ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచే సస్పెన్స్. ఈ మర్డర్ మిస్టరీ కి మరో ముఖ్య పాత్రలో మంచు మోహన్ బాబు గెస్ట్ రోల్‌లో నటించారు. తండ్రిగా ఆయన పాత్ర దక్ష కేసు పరిష్కారంలో ఎలా ఉపయోగపడతుందో, కథలో ఎలా మలుపు తీస్తుందో చూడాల్సిందే.
వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, థియేటర్‌లో మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మాస్టర్‌ఫుల్ సస్పెన్స్, కఠినమైన మిస్టరీ, సైకలాజికల్ ట్విస్టులతో ‘దక్ష-ది డెడ్లీ కాన్స్పిరెసీ’ ఈ దీపావళికు ఇంట్లో ప్రత్యేక ట్రీట్‌గా నిలుస్తుంది.