Dacoit: యంగ్ హీరో అడివి శేష్, శృతి హాసన్ జంటగా షానీల్ డియో దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోందని తెల్సిందే. ఈ మధ్యనే అడివి శేష్ అధికారికంగా ప్రకటించాడు. శేష్ EX శృతి అంటూ టైటిల్ పెట్టి.. ఆసక్తిని పెంచాడు. S.S.క్రియేషన్స్ మరియు సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ముందు నుంచి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినట్లే.. ఈ సినిమాకు డెకాయిట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఒక ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్. ఇక టైటిల్ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు హీరో.. విలన్స్ మీద రివెంజ్ తీర్చుకోవడం చూసాం. కనై, ఈ టైటిల్ టీజర్ లో శృతి, శేష్ ల మధ్య రివెంజ్ స్టోరీ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
యుద్దభూమిలో ఒకపక్క శేష్, ఇంకోపక్క గన్ పాంట్టుకొని శృతి హాసన్ మాయ జరిగిన సంభాషణను ఈ టీజర్ లో చూపించారు. జూలియట్ ఎన్నేళ్లు అయ్యింది మనం కలిసి అని శేష్ అనగా.. కలిసి కాదు విడిపోయి అని శృతి చెప్పుకొచ్చింది. ఇలా వీరిద్దరి మధ్య ప్రేమ, మోసం, పగ అని చూపించారు. ఇక ఒకరికి ఒకరు ఎదురయ్యినప్పుడు.. నేను నీకు ఏమవుతాను.. ఎక్స్ నా.. ? అంటే అది ఒకప్పుడు అని శృతి చెప్పుకొస్తుంది. అయితే ఇప్పుడేంటి.. వెధవనా.. ? దొంగనా.. ? విలన్ నా అంటూ ప్రశ్నిస్తాడు. ఇక చివర్లో ఒకరికి ఒకరు గన్ ను గురిపెట్టుకొని కాల్చుకున్నట్లు చూపించారు. ఇక ఆ షాట్ తో టైటిల్ ను రివీల్ చేశారు. ఇలాంటి కథ ఇప్పటివరకు ఎక్కడా చూసినట్లు అనిపించడం లేదు. అసలు శేష్, శృతి మధ్య ప్రేమ.. పగలా ఎలా మారింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. మరి ఈ సినిమాతో శేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
https://www.youtube.com/watch?v=mwwi7pk9K4s