దివంగత కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ నిన్న తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలీవుడ్ నటి అమీషా పటేల్ ట్విట్టర్‌లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయనతో కలిసి ఉన్న పలు చిత్రాలను షేర్ చేసుకుంటూ “హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్ ఫైజల్ పటేల్… లవ్ యూ… చాలా అద్భుతమైన సంవత్సరం” అంటూ ట్వీట్ చేసింది.
Read Also : కత్రినాకు షాక్… విక్కీ కౌశల్ పై కేసు నమోదు
అయితే ఫైజల్ మాత్రం ఆమెకు పెళ్లి ప్రతిపాదనతో సమాధానం ఇచ్చాడు. “ధన్యవాదాలు అమీషా పటేల్. నేను అధికారికంగా బహిరంగంగా ప్రపోజ్ చేస్తున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?” అంటూ ట్వీట్ చేశారు. కానీ తర్వాత ఫైజల్ తన ట్వీట్‌ను తొలగించాడు. అయితే నెటిజన్లు అప్పటికే ఆయన ట్వీట్ స్క్రీన్‌షాట్‌లను తీశారు. ఫైజల్, అమృత చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ ఇద్దరూ ఎప్పుడూ దాని గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. ఫైజల్ HMP ఫౌండేషన్ సీఈవో. ఆయన గతంలో జైనాబ్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే ఆయన భార్య 2017లో గుండెపోటు కారణంగా మరణించింది. మరోవైపు 45 ఏళ్ల అమీషా పటేల్ అవివాహితురాలు. అమీషా టాలీవుడ్ లో బద్రి, నాని. నరసింహుడు వంటి చిత్రాల్లో నటించింది.
