Jabardasth Praveen: జబర్దస్త్ ఎంతోమంది హాస్య నటులకు జీవితాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఆ స్టేజి మీద వెలుగొందుతున్న వారందరు ఒకప్పుడు అవకాశాల కోసం గేటువద్ద నిలబడినవారే. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరును సంపాదించుకున్న నటుల్లో ప్రవీణ్ ఒకడు. పటాస్ ద్వారా పరిచయమైన ప్రవీణ్.. జబర్దస్త్ లో ఆది స్కిట్ లో చిన్న చిన్న పాత్రలలో కనిపించి తన కామెడీ టైమింగ్ తో ఇప్పుడు అందరి స్కిట్స్ లో మెయిన్ లీడ్ గా చేస్తున్నాడు. ఇక ఇటీవలే ఫైమా తో లవ్ ట్రాక్ కూడా నడుస్తుండడంతో మరింత ఫేమస్ అయ్యాడు. తాజాగా ఈ నటుడి ఇంత తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ప్రవీణ్ తండ్రి కన్నుమూశారు.
గత కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవలే ఆయన వెన్నుపూసలో నీరు వచ్చిందని చెప్పిన డాక్టర్లు తీయడానికి ప్రయత్నించే లోపే ఆయన కాళ్లు చేతులు చచ్చుపడిపోయాయి. దీంతో ఆయన ఆరోగ్యంపూర్తిగా క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ఆయన మృతిచెందడం ప్రవీణ్ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ప్రవీణ్ చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని అతను జబర్దస్త్ వేదికపై చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోవడంతో అతని అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ కు ఒక అన్న ఉన్నాడు. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న జబర్దస్త్ నటులు ప్రవీణ్ తండ్రికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.