తెలుగులో ప్రభాస్ తో సాహో సినిమా చేసి మన వాళ్లకు కూడా దగ్గరైన శ్రద్ధా కపూర్ తాజాగా ‘స్త్రీ 2’ అనే సినిమాతో బంపర్ హిట్ కొట్టింది. ఒకరకంగా బాక్సాఫీస్ వద్ద ఆమె ఈ విజయాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తోంది. ‘స్త్రీ 2’ సినిమా ఈ సంవత్సరంలో హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది కూడా. శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ ‘గదర్ 2’, ‘జవాన్’ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక తాజాగా ఇంటర్వ్యూలో ఆమె తనకు ఒక రిలేషన్ ఉందని ధృవీకరించింది. నిజానికి ఆమె రచయిత రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తుందని, తరువాత విడిపోయిందని కూడా అనేక పుకార్లు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు ఆమె తను రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. అయితే ఎవరితో రిలేషన్ ఉన్నాను అనే విషయాన్ని పేరు చెప్పి రివీల్ చేయలేదు.
Pushpa 2: మైండ్ పోతుంది సార్ లోపల.. హైపెక్కించేసిన డీఎస్పీ
కానీ ఆమె అయితే తాను రిలేషన్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. నా లవ్ పార్ట్నర్ తో సమయం గడపడం, అతనితో సినిమాలు చూడటం, డిన్నర్ కోసం బయటకు వెళ్లడం లేదా ప్రయాణం చేయడం నాకు చాలా ఇష్టం అని శ్రద్దా కామెంట్ చేసింది. నేను సాధారణంగా కలిసి పనులు చేయడాన్ని ఇష్టపడతాను. అది నా మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని కామెంట్ చేసింది. శ్రద్ధా – రాహుల్ డేటింగ్ గురించి గత కొంతకాలంగా అనేక పుకార్లు వ్యాపించాయి . సినిమా రిలీజ్ లు, డిన్నర్ కోసం రెస్టారెంట్లకు వెళుతూ ఆమె తరచుగా రాహుల్ మోడీతో కలిసి కనిపించింది. రాహుల్ ‘తూ ఝూతి మైన్ మక్కర్’ సినిమా రచయిత. ఈ సినిమా నిర్మాణ సమయంలో ఇద్దరూ సన్నిహితంగా మారారు, అయితే ‘స్త్రీ 2’ విడుదలకు ముందు, శ్రద్ధ మరియు రాహుల్ విడిపోయారని పుకార్లు వ్యాపించాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అతన్ని అన్ ఫాలో చేయడం ఆ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.