టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ధమాకా దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా మన్మధుడు ఫేమ్ అన్షు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించారు. రాయాన్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సందీప్ కిషన్ నుండి వచ్చిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సందీప్ కిషన్, రావు రమేష్ కామెడి ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
Also Read : Mokshagna : మళ్లీ మొదటికొచ్చిన మోక్షజ్ఞ సినిమా..?
మజాకా సూపర్ హిట్ కావడంతో యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. నేడు చిత్ర హీరో సందీప్ కిషన్ విజయవాడ ఇంద్రాకిలాద్రి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుందీప్ కిషన్ మాట్లాడుతూ ‘నేను నటించిన సినిమా ‘మజాకా’ హిట్ అయిన సందర్బంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మ వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకున్నాను. మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు’ అని అన్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వాదం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని సందీప్ కిషన్ కు అందజేశారు ఆలయ అధికారులు. కాగా మజాకా నవ్వుల బ్లాక్ బస్టర్ థాంక్స్ మీట్ సాయంత్రం ఆవాస హోటల్ లో 5 గంటలకు నిర్వహించనున్నారు.