Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash React on Ramayana Budget: భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఈ ఇతిహాస సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా ప్రమోషన్లలో పదేపదే బడ్జెట్ గురించి ప్రస్తావించడంపై వస్తున్న విమర్శలపై యశ్ తాజాగా స్పందించారు. అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ సినిమా స్థాయిని పరిచయం చేయడానికే బడ్జెట్ వివరాలను వెల్లడిస్తున్నామని స్పష్టం చేశారు. అక్టోబర్ 15న బెంగళూరులో జరిగిన రామాయణ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో యశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
విదేశాల్లో సినిమాను ప్రమోట్ చేసేటప్పుడు దాని నిర్మాణ స్థాయి, పెట్టుబడి గురించి ధైర్యంగా చెప్పాల్సిన అవసరం ఉందని యశ్ అభిప్రాయపడ్డారు. తక్కువ బడ్జెట్ సినిమాగా పరిచయం చేస్తే అంతర్జాతీయ ప్రేక్షకులు దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని పేర్కొన్నారు. ‘నమిత్ మల్హోత్రా రామాయణ కోసం రూ.4,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పినప్పటి నుంచి చాలామంది ఆయనను విమర్శిస్తున్నారు. మన దేశంలో ఇదే సమస్య. విదేశాలకు వెళ్లి మన సినిమాలను ప్రమోట్ చేసేటప్పుడు తక్కువ బడ్జెట్ సినిమా అని చెబితే.. అక్కడి ప్రేక్షకులు దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. సినిమా నిర్మాణానికి ఎంత పెట్టుబడి పెట్టామో ఆత్మవిశ్వాసంతో చెప్పాలి. మన దేశాన్ని, మనం ఏమి చేయగలమో ప్రపంచానికి చూపించాలి’ అని యశ్ చెప్పుకొచ్చారు.
Also Read
- Sai Pallavi Saree Look: "మేడం సార్.. మేడం అంతే".. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
రామాయణను కేవలం భారీ బడ్జెట్ చిత్రంగా మాత్రమే కాకుండా.. భారతీయ సినిమా సాంకేతిక సామర్థ్యాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే అవకాశంగా చూడాలని యశ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి భారీ ప్రాజెక్టును నిర్మించడానికి అవసరమైన పెట్టుబడి, సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక ప్రయత్నాలను ప్రపంచ ప్రేక్షకులకు తెలియజేయడం ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే మన దేశంలో రూపొందే సినిమాలను మనమే తక్కువ చేసి మాట్లాడకూడదన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ సాధిస్తున్న పురోగతిని గుర్తించి, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దేశీయ సినిమాలను విమర్శించే ముందు వాటి వెనుక ఉన్న ప్రయత్నాన్ని, లక్ష్యాన్ని కూడా అర్థం చేసుకోవాలని యశ్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస చిత్రం పార్ట్ 1 ఈ దీపావళికి రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!