Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Chopra: గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన కెరీర్లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తాజాగా పంచుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఆమె హిందీ చిత్ర పరిశ్రమకు దూరమై హాలీవుడ్ వైపు వెళ్లడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. అయితే బాలీవుడ్‌ను ఎందుకు వదిలారనే విషయంపై ప్రియాంక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చని వ్యక్తులకు అనుగుణంగా మారకపోవడం, వారు చెప్పిన విధంగా నడుచుకోకపోవడం వల్ల కొన్ని సినిమా అవకాశాలు తన నుంచి దూరమయ్యాయని ప్రియాంక వెల్లడించారు. ఇతరులు రాజీ పడిన విధంగా తాను కూడా రాజీపడాలని అనుకోలేదని, తన ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇచ్చానని చెప్పారు.
కొంతమంది అగ్ర హీరోలు తనను ఉద్దేశపూర్వకంగా కొన్ని సినిమాల నుంచి తప్పించారని ప్రియాంక ఆరోపించారు. 2007లో ‘సలామ్-ఎ-ఇష్క్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ టైంలో తాను మరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న అప్పుడు ఆ సినిమా హీరో తనను కలిసేందుకు షూటింగ్ సెట్‌కు వచ్చారు. తనకు మద్దతుగా వచ్చారని భావించినప్పటికీ, ఆ హీరో చెప్పిన మాటలు ఆశ్చర్యానికి గురిచేశాయని ప్రియాంక చెప్పారు. “ఈ పాత్ర వాస్తవానికి మరో హీరోయిన్ కోసం అనుకున్నారు. పొరపాటున ఈ సినిమా మీకు వచ్చింది. భవిష్యత్తులో మనం మరో సినిమా చేద్దాం” అని చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు ఒక్కసారి మాత్రమే కాకుండా పలుమార్లు ఎదురయ్యాయని, ఆ సమయంలో తన కెరీర్‌పై మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానని ప్రియాంక తెలిపారు. తన నటన, కష్టమే తనను ముందుకు తీసుకెళ్లాయని, మరిన్ని అవకాశాలను అందించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
‘నా సినిమాలు లాగేసుకున్నారు’
కొంతమందిని మెప్పించలేదనే కారణంతో తన సినిమాలను లాగేసుకున్నారని గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఓ పాడ్‌కాస్ట్‌లో సంచనల కామెంట్స్ చేశారు. pic.twitter.com/BojmqnBQWl
— ChotaNews App (@ChotaNewsApp) July 22, 2026
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!