Shanmukh Jaswanth Arrest: సినిమాను మించిన ట్విస్టులు.. షన్ను అరెస్ట్ కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ పోలీసులు అదుపులో ఉన్నాడన్న అంశం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి యూట్యూబ్ లో వైవా అనే షార్ట్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఆ తరువాత యూట్యూబ్ లోనే అనేక షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్నాడు. గతంలో ఆయన చేసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో పాటు వెబ్ సిరీస్లు హిట్ కావడంతో బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత తాను దీప్తి సునయన ప్రేమలో ఉన్నాననే విషయం చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు షణ్ముఖ్. బిగ్బాస్ హౌస్లో సిరితో క్లోజ్ గా ఉండడంతో బయటకు వచ్చాక దీప్తి అతనికి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత తన పని తాను చూసుకుంటూ సైలెంట్ గా ఉంటున్న షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో పట్టుబడిన అంశం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. తాను చేసే షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశం ఇప్పిస్తానని వైజాగ్ కి చెందిన ఒక డాక్టర్ యువతితో స్నేహం చేసిన బిగ్ బాస్ ఫేం షణ్ముక్ ఆమెను తన అన్న సంపత్ వినయ్ కి పరిచయం చేశాడు. ఆ తరువాత సంపత్ వినయ్, యువతి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ఇద్దరూ పదేళ్లుగా ప్రేమించుకున్నారని, ఇద్దరి ఇంట్లో ఒప్పించి పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నారని సమా
Also Read; Trisha: 25 లక్షలకు రిసార్టు ఆరోపణలు.. అన్నాడీఎంకే నేతకు త్రిష లీగల్ నోటీస్
Also Read
మూడేళ్ల క్రితం ఇరు కుటుంబాల సమక్షంలో వైజాగ్ లో ఎంగేజ్మెంట్ కూడా జరిగినా యువతి తల్లికి అనారోగ్యం కారణంగా.. పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఈనెల 28న ఇద్దరి పెళ్లి అనుకుంటూ ఉండగా పెళ్లి పనులు కూడా పూర్తయిన క్రమంలో సంపత్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు డాక్టర్ యువతికి సమాచారం అందింది. దీంతో ఆమె నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు తో సంపత్ వినయ్ ఫ్లాట్ కి వెళ్ళారు పోలీసులు, అదే సమయానికి అదే ఫ్లాట్ లో బిగ్ బాస్ ఫేం షణ్ముక్ కూడా ఉన్నాడు. అతను మత్తులో ఉన్నాడనే విషయం తెలిసి పోలీసులు సోదాలు చేయగా ఫ్లాట్ లో గంజాయి దొరికింది, వెంటనే దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి కేసు విచారణకు వెళ్లి షణ్ముక్, సంపత్ వినయ్ లను అదుపులోకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు ఈ గంజాయి కేసు కూడా నమోదు చేశారు. ఇక ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే యువతి ఉందని, అన్నదమ్ములతో పాటు షణ్ముక్ ఫ్యామిలీ మొత్తం తనను మోసం చేసిందని యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. నిజానికి షన్ను కుటుంబానిది కూడా వైజాగే. అక్కడ కొంత ఫేం వచ్చాక సినీ ప్రయత్నాలు చేస్తూ అన్నదమ్ములు హైదరాబాద్ చేరినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
-
Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ రేంజ్ క్రేజ్.. నిర్మాతల ఛాయిస్‌గా అనిల్ రావిపూడి!
-
Supreme Court: విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
SC Status: ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు క్లారిటీ.. రివ్యూ పిటిషన్‌కు నో చెప్పిన ధర్మాసనం.!
-
Abhishek vs Samson: అభిషేక్‌కు ఓ రూల్.. సంజుకు మరో రూలా.. బీసీసీఐపై తెలుగు ప్లేయర్ ఫైర్!
ట్రెండింగ్
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!