Trisha: 25 లక్షలకు రిసార్టు ఆరోపణలు.. అన్నాడీఎంకే నేతకు త్రిష లీగల్ నోటీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే మాజీ సేలం యూనియన్ సెక్రటరీ ఏవీ రాజుకు నటి త్రిష లాయర్ నోటీసు పంపారు. నటి త్రిష తన ట్విట్టర్ ద్వారా లీగల్ నోటీసుల ఫోటోలను షేర్ చేసింది. ఈ నోటీసులో త్రిష తన గురించి AV రాజు మాట్లాడిన వీడియోలు, ఆ వీడియోల గురించి వచ్చిన వార్తల లింక్‌లను కూడా యాడ్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో త్రిష మన నష్టపరిహారం కోరినట్లు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఎంత అడిగారనేది కనపడకుండా త్రిష దాన్ని కవర్ చేశారు. ఎ.వి.రాజు చేసిన ఆరోపణల కారణంగా త్రిష మానసిక క్షోభకు గురైందని, దీంతో 4 రోజులలో నిర్ణీత మొత్తాన్ని ఆమెకు చెల్లించాలని లాయర్ నోటీసులో పేర్కొన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియాలో ఏ రూపంలోనైనా త్రిషపై పరువు నష్టం కలిగించడాన్ని ప్రచురించడం / ప్రదర్శించడం తక్షణమే నిలిపివేయాలని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు.
Also Read; Shreyas Iyer-BCCI: బీసీసీఐకి అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ అయ్యర్.. చర్యలు తప్పవా?
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మొదలైన వాటిలో త్రిషపై చేసిన పరువు నష్టం కలిగించే ప్రకటనలు, ఆరోపణలకు సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే తన స్వంత ఖర్చుతో తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయితే మరి రాజు ఈ విషయం మీద ఎలా స్పందించబోతున్నారు? త్రిష లీగల్ నోటీసులకు ఆయన సమాధానమిస్తారా? ఒకవేళ నాలుగు రోజులలో సమాధానం ఇవ్వకపోతే త్రిష లీగల్ టీం ఎలా ముందుకు వెళుతుంది? అనే అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ అంశం మీద త్రిషకు మద్దతు తెలుపుతూ విశాల్ ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. అందులో త్రిష గురించి కానీ పొలిటికల్ లీడర్ గురించి కానీ ఎలాంటి ప్రస్తావన లేకపోయినా ఆయన క్రియేట్ చేసింది ఇదే విషయం గురించి అనే క్లారిటీ అయితే ఉంది.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..