Balakrishana : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గాంగ్స్ ఆఫ్ గోదావరి “.కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.రీసెంట్ గా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ కు నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య అతిధిగా వచ్చారు..విశ్వక్ సేన్ నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని బాలయ్య విశ్వక్ కు బెస్ట్ విషెస్ తెలియజేసారు.
Read Also :Pushpa 2 : నెట్టింట అదరగొడుతున్న ‘పుష్ప 2’ కపుల్ సాంగ్..
అయితే స్టేజి పై వీరిద్దరి బాండింగ్ చూసిన ఇరువురి అభిమానులు.. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ వస్తే బాగుండు అని ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నారు. రీసెంట్ గా జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బాలయ్య మాట్లాడుతూ.. ‘త్వరలో నేను విశ్వక్ సేన్ కలిసి ఒక మంచి కాంబో అనౌన్స్ చేయబోతున్నాము. అది డిజిటల్ లో ఉండబోతుంది’ అంటూ బాలయ్య తెలిపారు ప్రస్తుతం బాలయ్య కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి.త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక వెబ్ సిరీస్ రాబోతుంది అంటూ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
#Balakrishna & #VishwakSen combo 💥🤩✅
WebSeries or Movie? 🙃 pic.twitter.com/2RGfygKccO
— Filmy Bowl (@FilmyBowl) May 28, 2024