Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “..బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప”కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.
Read Also :HAROMHARA : గూస్ బంప్స్ తెప్పిస్తున్న సుధీర్ బాబు ‘హరోంహార’ ట్రైలర్..
ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి మేకర్స్ రీసెంట్ గా ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు.”పుష్ప పుష్ప”అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించి నెట్టింట అదరగొడుతుంది.తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు..’సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి “అంటూ సాగె ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.పుష్ప రాజ్ ,శ్రీవల్లి మధ్య సాగే ఈ కపుల్ సాంగ్ నెట్టింట అదరగొడుతుంది.ఇప్పటికే యూట్యూబ్ లో ఈ సాంగ్ తెలుగు వెర్షన్ కి 10 మిలియన్లు ,అలాగే హిందీ వెర్షన్ కి 6 మిలియన్ల వ్యూస్ లభించాయి.ఈ సాంగ్ రిలీజ్ అయిన 24 గంటలలోనే ఏకంగా 12 దేశాలలో 31 మిలియన్ రియల్ టైం వ్యూస్ అలాగే 19 మిలియన్ల అప్డేటెడ్ వ్యూస్ సాధించి నెట్టింట అదరగొడుతున్నట్లు చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.
The world is vibing to #TheCoupleSong ❤🔥#Pushpa2SecondSingle TRENDING across 12 COUNTRIES on YouTube with 31 MILLION+ REAL-TIME VIEWS & 19M+ UPDATED VIEWS 💥💥
▶️ https://t.co/Tgu57adbiT#Sooseki #Angaaron #Soodaana #Nodoka #Kandaalo #Aaguner 👌 #Pushpa2TheRule Grand… pic.twitter.com/ClZK10KDU7
— Pushpa (@PushpaMovie) May 30, 2024