బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో.. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన, భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రమే “వార్ 2”. ఒక క్రేజీ మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ మూవి కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా మ్యూజికల్ ట్రీట్ వచ్చేసింది.
Also Read : Tamil Actress Srinivasan : రూ.5 కోట్లు మోసం – తమిళ నటుడు శ్రీనివాసన్ అరెస్ట్
వార్ 2 నుంచి ‘ఊపిరి ఊయలగా’ అనే లవ్ సాంగ్ విడుదలైంది. ప్రస్తుతం ఈ సాంగ్ అభిమానుల్లో, యూత్‌లో మంచి క్రేజ్ సంపాదిస్తోంది. హృతిక్ రోషన్ – కియారా అద్వానీ కెమిస్ట్రీకి ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాఫ్ట్‌గా, ఎమోషన్‌తో నిండిన ఈ ప్రేమ గీతం ఓ ఊహించని టోన్‌ని పరిచయం చేస్తోంది. ఈ పాటకు తెలుగు లిరిక్స్‌ని రాసిన చంద్రబోస్ భావోద్వేగాన్ని అద్భుతంగా పలికించారు. శశ్వత్ సింగ్, నిఖితా గాంధీ వినిపించిన గాత్రం పాటకు మరింత ప్లస్ అయ్యింది. ఇక హృతిక్ స్టైలిష్ లుక్, కియారా స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ వీడియో సాంగ్ విజువల్స్, ముఖ్యంగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. ఈ పాట విడుదలతో WAR 2 మూవీపై ఉన్న బజ్ మళ్లీ పీక్స్‌కి చేరింది.