తెలుగు వెండితెరపై ఇప్పుడు ‘బూతు’ పురాణం నడుస్తోంది. ఒకప్పుడు పవర్ఫుల్ డైలాగ్స్ అంటే రోమాలు నిక్కబొడుచుకునే గంభీరమైన మాటలు ఉండేవి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరో నోటి వెంట బూతు పడితేనే ఆ డైలాగ్‌కు పవర్ వస్తుందని, సినిమాకు క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ పరిణామం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీస్తోంది.
Also Read: Vrushabha Review: వృషభ రివ్యూ.. మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?
సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత సెన్సార్ బోర్డు అభ్యంతరకర పదాలను కత్తిరిస్తుందని తెలిసినా, టీజర్లు మరియు ట్రైలర్లలో కావాలని ఈ ‘డర్టీ’ డైలాగ్స్‌ను జోడిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రమోషన్ అండ్ పబ్లిసిటీ. ఓటీటీల్లో బూతులకు అడ్డు అదుపు లేకపోవడంతో, ఆ కల్చర్‌ను వెండితెరకు కూడా అలవాటు చేస్తున్నారు. టీజర్లో బూతు ఉంటే అది సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అవుతుందని, యువతను ఆకర్షించవచ్చనేది సినిమా వాళ్ల ఎత్తుగడ.
Also Read:Anasuya: శివాజీని వదలని అనసూయ..ఆయనకు 54.. నాకు 40.. నన్ను ఆంటీ అంటారా?
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు సైతం ఇలాంటి డైలాగ్స్ చెప్పడానికి వెనకాడటం లేదు. రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్, తన తాజా చిత్రం ‘రౌడీ జనార్ధన’లో నోటి వెంట బూతులతో కనిపిస్తుండటం చర్చనీయాంశమైంది. ఎప్పుడూ పద్ధతిగా ఉండే నేచురల్ స్టార్ నాని సైతం ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం ఒక డర్టీ వర్డ్‌ను ఏకంగా టాటూగా వేయించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కె ర్యాంప్ సినిమా టీజర్లో వచ్చిన బూతు డైలాగ్ అప్పట్లో పెద్ద రచ్చకే దారితీసింది.
దర్శక నిర్మాతలు ఈ ధోరణిని సమర్థించుకోవడానికి “కథ మరియు క్యారెక్టరైజేషన్ డిమాండ్ చేసింది” అనే మాటను వాడుతున్నారు. సహజత్వానికి దగ్గరగా ఉండాలనే సాకుతో పచ్చి బూతులను డైలాగ్స్‌లా మార్చేస్తున్నారు. కేవలం ఓపెనింగ్స్ కోసం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కోసం కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లో కూడా ఇలాంటి భాషను వాడటం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు క్లీన్ ఎంటర్టైన్మెంట్కు మారుపేరుగా ఉన్న టాలీవుడ్, ఇప్పుడు ఈ ‘బూతు’ మాయలో పడి తన ప్రాభవాన్ని కోల్పోతుందా? లేక ఇదే ఆధునిక సినిమా సూత్రమా? అనేది ప్రేక్షకులు ఆలోచించాల్సిన విషయం.