మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. భారీ విజువల్స్, విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను UV క్రియేషన్స్ నిర్మిస్తోంది. దర్శకుడు వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విడుదల తేదీ గురించి ఇప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు. అయితే అభిమానుల్లో మాత్రం ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు సినిమా గురించి సైలెంట్ గా ఉన్న వశిష్ట, ఎట్టకేలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిత్రం గురించి కీలక విషయాలు వెల్లడించారు.
Also Read : Venkat : టాలీవుడ్ నటుడి ఆరోగ్యం విషమం.. సాయం కోసం వేడుకుంటున్న భార్య..
వశిష్ట తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ‘ సినిమా విడుదలలో ఆలస్యానికి ప్రధాన కారణం భారీ స్థాయిలో జరుగుతున్న VFX పని. ఈ చిత్రంలో మొత్తం 4676 VFX షాట్లు ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్ కూడా విజువల్‌గా అద్భుతంగా ఉండాలని మేం కష్టపడుతున్నాం. అందుకే టాప్ క్లాస్ గ్రాఫిక్స్ సంస్థలు ఈ సినిమా మీద పనిచేస్తున్నాయి,ఒక పాట మినహా సినిమా మొత్తం షూటింగ్ పూర్తయింది.ఈ పాటను కూడా త్వరలో చిత్రీకరించనున్నాము. అంతేకాకుండా, ఈ స్పెషల్ సాంగ్‌లో మౌని రాయ్ కనిపించనున్నారు అన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే విడుదల తేదీ ప్రకటిస్తాము’ అని వశిష్ట తెలిపారు. ఇక ఇప్పటికే ‘విశ్వంభర’ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, ఈ తాజా అప్‌డేట్ అభిమానుల్లో మరింత హైప్ పెంచింది. మెగా అభిమానులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.