Kannappa: అమెరికాలో ‘కన్నప్ప’ ప్రమోషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను ఒక మైలురాయి చిత్రంగా రూపొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రపంచవ్యాప్త మార్కెట్‌ను అధ్యయనం చేస్తూ, గ్లోబల్ స్థాయిలో ప్రమోషన్స్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ హిస్టారికల్ మూవీ ప్రమోషన్స్‌ను అమెరికా నుంచి ప్రారంభించనున్నారు. కన్నప్ప యూఎస్ఏ టూర్ మే 8న న్యూజెర్సీలో ఆరంభం కానుంది. అక్కడ విష్ణు నార్త్ బ్రున్స్‌విక్‌లోని రీగల్ కామర్స్ సెంటర్‌లో అభిమానులతో సమావేశమై ముచ్చటించనున్నారు.
Read More:Nani: బ్లడీ రోమియో మొదలెట్టేది అప్పుడే!
Also Read
మే 9న డల్లాస్‌కు వెళ్లి, సాయంత్రం 7 గంటలకు గెలాక్సీ థియేటర్స్ గ్రాండ్‌స్కేప్, ది కాలనీ, టెక్సాస్‌లో ప్రేక్షకులతో సందడి చేయనున్నారు. ఈ పర్యటన మే 10న శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ముగుస్తుంది. అక్కడ ఆయన ఉదయం 10:30 గంటలకు సినీ లాంజ్ ఫ్రీమాంట్ 7 సినిమాస్‌ను సందర్శించనున్నారు. ఈ చిత్రం ఓవర్సీస్ విడుదలను వాసారా సంస్థ చూసుకుంటోంది. అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన విష్ణు, దేశంలోని పలు నగరాల్లో పర్యటించనున్నారు.
Read More: Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఏంటి?
ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, అన్ని వర్గాల ప్రేక్షకులతో కనెక్ట్ కావడం కోసం, వివిధ ప్రాంతాల మీడియాతో విష్ణు మంచు సంభాషించనున్నారు. కన్నప్ప నుంచి విడుదలైన భక్తి గీతం “శివా శివా శంకరా” పాజిటివ్ వైబ్స్‌ను సృష్టించిన సంగతి తెలిసిందే. చిత్రంలోని లవ్ ట్రాక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అందరి దృష్టి కన్నప్ప ట్రైలర్‌పై ఉంది. ట్రైలర్ విడుదలతో అంచనాలు ఆకాశాన్ని తాకనున్నాయి. జూన్ 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కన్నప్ప చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్‌లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!