Site icon NTV Telugu

VISHAL : గ్రాండ్ గా విశాల్ – సాయి ధన్సిక ఎంగేజ్మెంట్..

Vishalsai

Vishalsai

తమిళ నటుడు, నిర్మాత విశాల్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సినీ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్. ప్రేమ చదరంగం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విశాల్ పందెం కోడి సినిమాతో  గుర్తింపు తెచుకున్నాడు. భరణి, పూజా, సెల్యూట్ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. ఇక మార్క్ ఆంటోనితో వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. కెరీర్ జెట్ స్పీడ్ లో సాగుతున్న విశాల్ తన వ్యక్తిగత జీవితం గురించి గుడ్ న్యూస్ చెప్పాడు. తమిళ నటి సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నానని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ప్రకటించాడు విశాల్.

Also Read : Power Star : ‘OG’ ఆల్ టైమ్ రికార్డ్.. పవర్ స్టార్.. పవర్ స్ట్రోమ్

ఇక నేడు విశాల్ పుట్టిన రోజు నాడు తన ప్రేయసి సాయి ధన్సికను నిశ్చితార్థం చేసుకున్నాడు విశాల్. అటు విశాల్ ఇటు సాయి ధన్సికకు చెందిన కుటుంభ సభ్యులతో పాటు కేవలం అతి కొద్దీ మంది బందు మిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా ధన్సిక చేతికి ఉంగరం తొడిగాడు విశాల్. అందుకు సంబందించిన ఫోటోలను తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘నా ప్రత్యేక పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు ధన్సిక తో జరిగిన నా నిశ్చితార్థం గురించి శుభవార్తను మా కుటుంబాల మధ్య మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఎప్పటిలాగే మీ ఆశీర్వాదాలు మరియు ప్రేమను మాపై ఉంచాలని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేసాడు. కబాలి సినిమాలో రజినీకాంత్ కు కూతురుగా, దక్షిణ వంటి సినిమాలలో హీరోయిన్ గాను నటించింది ధన్సిక.

Exit mobile version