“రాపో19” కోసం పవర్ ఫుల్ విలన్ ?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో “రాపో19” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ‘రాపో19’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. లింగుసామికి తెలుగులో ఇదే మొదటి డైరెక్ట్ మూవీ కాగా, ఈ చిత్రంతో రామ్ తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారు. కాగా “రాపో19” షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. తాజా అప్డేట్ ఏంటంటే… రామ్ ను ఈ చిత్రాల్లో ఓ పవర్ ఫుల్ కోలీవుడ్ విలన్ ఢీ కొట్టబోతున్నాడట.

Read Also : “మిమి” ట్రైలర్ : ఫన్నీ గా సరోగసీ మదర్ జర్నీ… ఎమోషన్స్ కూడా !

ఆ పవర్ ఫుల్ విలన్ మరెవరో కాదు తమిళ హీరో ఆర్య. దర్శకుడు ఆయనకు కథను విన్పించారట. అందులో ఆర్యకు తన పాత్రా బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. కానీ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఆర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాన్ని సాధించాయి. వరుడు, సైజ్ జీరో, రాజా రాణి వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించాడు. మరోవైపు హీరో రామ్ తమిళంలో కూడా తన పాత్రకు డబ్బింగ్ తానే చెప్పుకుంటాడట.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-