Vijay Sethupathi: విజయ్‌తో జీవితంలో మళ్లీ కలిసి పని చేయకూడదు అనుకున్న .. దర్శకుడు పాండిరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా, నిత్య మీనన్ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం ‘తలైవన్ తలైవి’. దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. అయితే తాజాగా ఈ ‘తలైవన్ తలైవి’ సినిమా ఈవెంట్ లో భాగంగా దర్శకుడు పాండిరాజ్ మాట్లాడిన మాటలు ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Chiranjeevi : రవి తేజ తండ్రి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం..
Also Read
గతంలో, దర్శకుడు పాండిరాజ్, నటుడు విజయ్ సేతుపతి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో ఆ విభేదాల కారణంగా.. ‘జీవితంలో మళ్లీ ఇంకెప్పుడూ కలిసి పనిచేయకూడదని తామిద్దరం నిర్ణయించుకున్నాం. అయితే, ఈ నిర్ణయం ఊహించని విధంగా మారిపోయింది. ప్రముఖ దర్శకుడు మిష్కిన్ పుట్టినరోజు పార్టీలో తామిద్దరం మళ్లీ కలుసుకున్నాం. ఈ సందర్భంగా, విజయ్ సేతుపతి స్వయంగా కలిసి, ‘మనం కలిసి ఒక సినిమా చేద్దాం’ అని వెల్లడించారు. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య నెలకొన్న దూరం తొలగిపోయి, కొత్త ప్రయాణానికి బీజం పడింది. అలా కలిసిన తర్వాత ‘తలైవన్ తలైవి’ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ కథానాయకుడి పాత్రకు విజయ్ సేతుపతి సరైన ఎంపిక అని భావించి. కథ పూర్తయిన తర్వాత సేతుపతికి కేవలం 20 నిమిషాల పాటు కథను వివరించాను. కథను విన్న వెంటనే, సేతుపతి ఏ మాత్రం ఆలోచించకుండా అంగీకరించా’ అని వివరించారు పాండిరాజ్.
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!