Romanchakam Glimpse: జానకి చెంతనే రాముడి హృదయం.. సందీప్ వంగా ‘రోమాంచకం’ గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ ఉందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Romanchakam Glimpse: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘రోమాంచకం’. ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుమంత్ ప్రభాస్ – అనంతిక శాసిల్కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ లవ్, కామెడీ, రోమాంటిక్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ స్టార్టింగ్‌లో వచ్చే కవిత ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. జానకి చెంతనే రాముడి హృదయం.. ఈ ప్రేమ కావ్యం మృదుమధురం అంటూ సాగిన ఈ గ్లింప్స్‌లో సుమంత్ ప్రభాస్, అనంతిక మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్‌తో పాటు, కామెడీ డైలాగ్స్, నవ్వులు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ గ్లింప్స్ డీవోపీ పవన్ పప్పుల అందించిన బ్యూటిఫుల్ విజువల్స్‌తో, వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన స్వీట్ మెలొడియస్ ట్యూన్‌తో సాగుతూ హీరోయిన్స్ మధ్య ఉన్న ప్రేమను, వారి మధ్య ఏర్పడిన దూరాన్ని చూపిస్తూ సాగింది. ‘అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే — రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే — రోమాంచకం..’ అంటూ గ్లింప్స్ లో వచ్చిన లిరిక్స్ ఈ మూవీ ఎంత వైబ్రేటింగ్‌గా ఉండబోతుందో తెలియజేస్తోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక జంట కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తోందని అర్థం అవుతుంది. “రోమాంచకం” సినిమా ఒక ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
తాజావార్తలు
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!