Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్‌లో విజయ్ దేవరకొండ సినిమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rowdy Janardhana: టాలీవుడ్లో ఇప్పుడు ఎవరి ప్రాజెక్ట్ చూసినా ‘పార్ట్-1’, ‘పార్ట్-2’ ఫార్ములానే నడుస్తోంది. బాహుబలి, పుష్ప సినిమాలు రెండు పార్ట్‌లుగా రాగా, సలార్, దేవర లాంటి సినిమాలు పార్ట్ 1 తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడంతో మిగతా హీరోలు, డైరెక్టర్లు కూడా ఇదే రూట్ పడుతున్నారు. ఇప్పుడు ఈ క్రేజీ ట్రెండ్‌లోకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రౌడీ జనార్ధన’ను రెండు భాగాలుగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. మరోవైపు ఈ ప్రచారంపై రౌడీ ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అసలు కథలో నిజంగా అంత స్కోప్ ఉందా? లేక కేవలం బిజినెస్ లెక్కల కోసమే రెండు భాగాలుగా మారుస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కథ డిమాండ్ చేస్తే రెండు పార్ట్‌లుగా తీసినా ఓకే కానీ, కేవలం బిజినెస్ కోసమే సాగదీస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడే ప్రమాదం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ పార్ట్ జనాలకు గట్టిగా ఎక్కితేనే రెండో పార్ట్‌పై అంచనాలు, బిజినెస్ పెరుగుతాయి. ఒకవేళ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా ఆ ప్రభావం మొత్తం ఫ్రాంచైజీ మీదే పడుతుందని అంటున్నారు. నిజానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ మార్కెట్‌కు కావాల్సింది బాక్సాఫీస్ వద్ద వరుసగా సాలిడ్ సక్సెస్‌లు. అలాంటి టైంలో ట్రెండ్‌ను నమ్ముకుని రెండు భాగాల బాట పట్టడం విజయ్‌కు ఏమేరకు కలిసొస్తుందో చూడాలని చెబుతున్నారు. రౌడీ జనార్ధన సినిమా విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో అసలు వాస్తవం ఎంతనే దానిపై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్‌లో విజయ్ దేవరకొండ సినిమా?
-
NIMS Corruption : నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఒకేసారి మూడు శాఖల తనిఖీలు!
-
World Record Century: 38 బంతుల్లో శతకం.. రికార్డు స్పష్టించిన తనీషా..
-
Chiranjeevi : నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేయబోతున్న ‘చిరంజీవీస్ మెగావర్స్’!
-
YSRCP: పింఛన్ల పంపిణీపై వైసీపీ ఫిర్యాదు.. టీడీపీకి చెక్ పెట్టాలని డిమాండ్
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?