Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!

Vijay Rashmika

Vijay Rashmika

డిజిటల్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగుతోంది.. అదే ‘విరోష్’. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రశ్మిక మందన్నల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం సినిమాల్లోనే కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లలోనూ ఈ జోడీ గ్లోబల్ స్థాయిలో రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా ఈ వెండితెర జంట ఇన్‌స్టాగ్రామ్‌లో మరో అరుదైన మైలురాయిని అధిగమించి వార్తల్లో నిలిచింది. విజయ్, రశ్మిక కలిసి నటించిన ‘ఎయిర్‌బీఎన్‌బీ’ (Airbnb) కపుల్ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 9.1 మిలియన్లకు పైగా లైక్స్రా వడం విశేషం. గ్లోబల్ స్థాయిలో ఒక కమర్షియల్ యాడ్‌కు ఈ స్థాయిలో లైక్స్ రావడం అత్యంత అరుదైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్ సాధించిన యాడ్స్ జాబితాలో ఇది రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికీ ఈ లైక్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉండటం వీరికున్న ఫాలోయింగ్‌కు నిదర్శనం.

ట్విస్ట్ ఏంటంటే.. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రికార్డు కూడా విరోష్ జోడీ పేరునే ఉండటం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘మాన్యవార్’ వెడ్డింగ్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి తోడు 104 మిలియన్ల వ్యూస్ రావడం మరో రికార్డు. ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ ఐకాన్స్ కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్‌కు మించిన ఆదరణ విజయ్-రశ్మికల యాడ్స్‌కు దక్కడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలను సైతం పక్కకు నెట్టి, ఇండియన్ స్టార్స్ ఇలా గ్లోబల్ రికార్డులు క్రియేట్ చేయడం చూస్తుంటే సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఈ జోడీ ఒక తిరుగులేని బ్రాండ్‌గా మారిందని స్పష్టమవుతోంది. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే.. “గీత గోవిందం”, “డియర్ కామ్రేడ్” చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ **”రణబాలి”** చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం యాడ్స్‌తోనే ఇలాంటి రికార్డులు సృష్టిస్తుంటే, ఇక బిగ్ స్క్రీన్‌పై వీరిద్దరూ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురవడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.