Family Star : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్ “.స్టార్ డైరెక్టర్ పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది.విజయ్,పరశురాం కాంబినేషన్ లో గతంలో వచ్చిన “గీత గోవిందం” బ్లాక్ బస్టర్ హిట్ అయింది.గీత గోవిందం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావడంతో ఫ్యామిలీ స్టార్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళం భాషల్లో భారీ గ్రాండ్‌గా విడుదల అయింది.
Read Also:Ananya Nagalla : కర్ర సాముతో అదరగొడుతున్న అనన్య.. వీడియో వైరల్..
అయితే ఈ సినిమా రిలీజ్అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ప్రభావం ఈ సినిమా కలెక్షన్స్ పై పడింది.దీనితో ఈ మూవీ ఆశించిన స్థాయిలో కలెక్టన్స్ సాధించలేదు. అయితే థియేటర్లలో ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటిలో అదరగొడుతుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైం వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వైరల్ అవుతుంది. ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు మరో రెండు భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. విజయ్ దేవరకొండపై ప్రేక్షకులలో వున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని కర్ణాటక, కేరళ ప్రేక్షకులు కూడా చూసే అవకాశం కల్పించారు. ఫ్యామిలీ స్టార్ మూవీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ ఇప్పటికే ట్రెండింగ్‌లో నిలిచింది.