స్టార్ హీరోగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయటం అంటే బాధ్యత మాత్రమే కాదు… బరువు కూడా! ఆ బరువు-బాధ్యత రెండూ బాగా తెలిసిన వాడు విక్కీ కౌశల్. బాలీవుడ్ యంగ్ టాలెంట్ ఇప్పటికే తన ప్రతిభతో ఎందర్నో ఆకట్టుకున్నాడు. అంతే కాదు, తన ఫిజిక్ అండ్ పర్ఫెక్ట్ లుక్స్ తో కూడా ‘యురీ’ స్టార్ యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తున్నాడు. విక్కీ హ్యాండ్సమ్ లుక్స్ కి కత్రీనా లాంటి టాప్ బ్యూటీయే పడిపోయింది. వారిద్దరూ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారనేది బీ-టౌన్ రూమర్…
కత్రీనాతో విక్కీ కౌశల్ సమ్ థింగ్, సమ్ థింగ్ పక్కన పెడితే… ప్రొఫెషనల్ గా స్టార్ హీరో ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే, ఆ మధ్య విక్కీ కూడా కరోనా బారిన పడక తప్పలేదు. క్రమంగా కోలుకున్నాడు కూడా. అయితే, ఇప్పుడు పూర్తిగా ఫిట్ నెస్ మీద దృష్టిపెట్టాడు. వరుసగా సినిమాలు షూట్ చేయాల్సి ఉండటంతో భారీగా బరువులెత్తుతూ జిమ్ లో వర్కవుట్లు చేస్తున్నాడు. లెటెస్ట్ గా ఓ వీడియో షేర్ చేశాడు ఇన్ స్టాలో.
Read Also : డైలీ సీరియల్ కి 21 ఏళ్లు! ఏక్తా కపూర్ భావోద్వేగం…
తన పర్సనల్ లెవల్లో రికార్డు సృష్టించానని పేర్కొన్నాడు విక్కీ. అంతకు ముందు ఎత్తిన భారీ బరువుల కంటే ఈసారి వెయిట్ మరింత ఎక్కువట! అది ఎంతో చెప్పలేదుగానీ… వీడియో చూస్తే మనకు ఆటోమేటిక్ గా ఓ ఐడియా వచ్చేస్తుంది! కరోనా బారినా పడి కోలుకున్నప్పటికీ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఈ యంగ్ హీరో హెవీ వెయిట్స్ ఎత్తటం నెటిజన్స్ కు ఇన్ స్పిరేషన్ గా పని చేస్తోంది! విక్కీ లెటెస్ట్ వర్కవుట్ వీడియో ఎవరు చూసినా… న్యూ ఫిట్ నెస్ గోల్స్ సెట్ చేయటం… పక్కా!