తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుత కాంబో విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి సినిమాలు అంటే ప్రేక్షకులకు ఒక పండగ లాంటిది. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లేశ్వరి’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించగా, ఆ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టాక్ వినిపిస్తోంది. నిజానికి వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో సీనియర్ హీరోల్లో 300 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి సంచలనం సృష్టించారు. ఈ సినిమా విజయం తర్వాత ఆయన కొత్త కథల కోసం ఎన్నో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, చివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారు.
UP: ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయిపై దాడి.. నిందితులకు ‘‘యోగి’’ మార్క్ ట్రీట్మెంట్.. వీడియో వైరల్..
వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్రివిక్రమ్ ఎప్పటిలాగే ఈ చిత్రంలో తనదైన మార్క్ సంభాషణలు, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనప్పటికీ, అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో ఒక సినిమా ఖరారైంది. దీంతో త్రివిక్రమ్‌కు కాస్త సమయం లభించింది. ఈ గ్యాప్‌ను ఉపయోగించుకుని వెంకటేష్‌తో సినిమాను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. అల్లు అర్జున్‌తో సినిమా వెంకటేష్ ప్రాజెక్ట్ తర్వాత మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.