వెంకీ అట్లూరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలుత నటుడిగా కొన్ని సినిమాలు చేసిన ఆయన, తర్వాత దర్శకుడిగా మారి తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ‘తొలిప్రేమ’ అంటూ వరుణ్ తేజ్‌తో హిట్ కొట్టిన ఆయన, తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమా చేసి పరాజయం పొందారు. ‘రంగ్ దే’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ, తర్వాత చేసిన ‘సార్’…