Venky Anil5 : ఆ సినిమా రీమేక్ కాదు.. కీర్తి సురేష్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venky Anil5 : విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #VenkyAnil5 (NKRAR2). ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మలయాళ గురువాయూర్ అంబల్ నడయిల్ సినిమాకు రీమేక్ అంటూ వస్తున్న వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ ప్రచారానికి చెక్ పెడుతూ కీలక విషయాలను వెల్లడించారు. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై కీర్తి సురేష్ స్పందిస్తూ… ఈ సినిమా రీమేక్ అంటూ వస్తున్న రూమర్స్ పూర్తిగా అవాస్తవమని, వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ సినిమా గురించిన ప్రచారం బేస్‌లెస్ అని ఆమె తేల్చి చెప్పారు.
ఈ సినిమా ఏ సినిమాకూ రీమేక్ కాదు. ఇది దర్శకుడు అనిల్ రావిపూడి సొంతంగా రాసుకున్న ఒక సరికొత్త వైవిధ్యమైన కథ. అనిల్ రావిపూడి మార్క్ మార్కుతో, పక్కా ఒరిజినల్ స్క్రిప్ట్‌తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో గతంలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వర ప్రసాద్ గారు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పూయించాయి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న ఐదవ సినిమా కూడా రీమేక్ కాదని, పక్కా స్ట్రెయిట్ ఒరిజినల్ కథతోనే వస్తోందని కీర్తి సురేష్ కన్ఫర్మ్ చేయడంతో విక్టరీ వెంకటేష్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ ఒరిజినల్ ఎంటర్టైనర్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
- R. Narayana Murthy: 'కామ్రేడ్' పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
- Legacy: విశ్వక్ సేన్ 'లెగసీ' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్‌నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ 'కామ్రేడ్ కళ్యాణ్'!
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!