నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే తెచ్చారు. నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ ఇవాళ విడుదలైంది. ఏపీలోని నంద్యాలలోని మిని ప్రతాప్ థియేటర్ లో వీరసింహారెడ్డి సినిమా కాసేపు నిలిచిపోయింది. తెల్లారి జామున 5 గంటలకే ప్రారంభమైంది సినిమా షో. వివిధ కారణాల వల్ల రెండు సార్లు 45 నిమిషాల పాటు సినిమా నిలిచిపోయింది. దీంతో బాలయ్య అభిమానుల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. తర్వాత సినిమా యధావిధిగా కొనసాగింది. సాంకేతిక లోపాలే కారణమంటున్నారు థియేటర్ సిబ్బంది.
ప్రతి సీన్‌లోనూ, ప్రతి షార్ట్‌లోనూ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులకు థియేటర్లలో ఊపునిస్తుంది. అంతేకాదు బాలయ్య – తమన్ కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ రేంజ్ లో కష్టాలు పడుతూనే తమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్స్ లో బాలయ్య అభిమానులకు స్పెషల్ ట్రీట్ తీసుకొచ్చాడంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా మాస్ మొగుడు.. సుగుణసుందరి పాట ప్లే అవుతుంటే సీట్లలో కూర్చోకుండా దూకేసే అభిమానుల అరుపులతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. మరి కలెక్షన్ల పరంగా వీరసింహారెడ్డి ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో లేక బద్దలు కొడతాడో చూడాలి..?