పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ హరిహర వీరమల్లు. పిరియాడికల్ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన వీరమల్లు మిశ్రమ స్పందన రాబట్టింది. పవర్ స్టార్ క్రేజ్ తో తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ. 70 కోట్ల రేంజ్ ఓపెనింగ్ అందుకుంది.
Also Read : HHVM : హరిహర వీరమల్లు ఉచిత ప్రదర్శనలు..
కానీ నెగిటివ్ మౌత్ టాక్ కారణంగా రెండవ రోజు నుండి వీరమల్లు కలెక్షన్స్ లో బాగా డ్రాప్ కనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్ అభిమానుల అంచనాలను అందుకోలేక పోవడం, బ్యాడ్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాపై నెగిటివ్ టాక్ ఎక్కవ వచ్చేలా చేసింది. అప్పటికి సదరు సీన్స్ తొలగించినా కూడా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వర్షన్ లో మాత్రమే రిలీజ్ చేసారు. వివిధ కారణాల వలన హిందీ వర్షన్ రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్. ఇప్పడు హిందీ వెర్షన్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు ఫినిష్ చేసారు. ఆగస్టు 1నుండి హరిహర వీరమల్లు హిందీలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు హిందీ వర్షన్ రిలీజ్ అవసరమా, సినిమా సూపర్ హిట్ అయితే అది వేరే సంగతి. తెలుగు స్టేట్స్ లోనే మిశ్రమ స్పందన రాబట్టిన సినిమాను మరోసారి హిందీ వర్షన్ లో రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని టాలీవుడ్ సిర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.