Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. హీరో వరుణ్ సందేశ్, ప్రముఖ నటుడు జెమిని సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం “బ్లాక్ మెయిల్”. హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై అవినాష్ కూనపరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస్ గుండ్రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీనివాస్ తనకు ఎప్పటినుంచో పరిచయమని, ఈ కథ చెప్పగానే ఇందులో ఉన్న పటిష్టమైన కంటెంట్ చూసి వెంటనే ఓకే చెప్పానని అన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని తెలిపారు. నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ.. వరుణ్ సందేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాత అవినాష్ ప్రతి విషయంలో అండగా నిలుస్తున్నారని, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా రూపొందుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమం మొత్తానికి నిర్మాత అవినాష్ కూనపరెడ్డి చేసిన కామెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినీ పరిశ్రమలోకి తాను రావడానికి ముఖ్య కారణం దాదాపు 200 కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యమేనని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల్లో 10% వాటాను సినిమా కోసం అహర్నిశలు శ్రమించిన టెక్నీషియన్స్‌కు అందిస్తానని, తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా భావన పోలేపల్లి వ్యవహరిస్తున్నారు.
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు సమంత బంపర్ ఆఫర్!
తాజావార్తలు
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!