రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా టైటిల్‌తో పాటు స్పెషల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో యువ నిర్మాత కార్తికేయ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్తికేయ మాట్లాడుతూ “నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ త్వరగా వస్తుందనుకోలేదు. ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ లెజెండ్స్. ఈ సినిమా భాగం కావడం నాకు ఒక పెద్ద అదృష్టం. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లండి.. ప్రపంచ ప్రేక్షకులు ఇండియా పై దృష్టి పెట్టేలా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం ఆనందంగా ఉంది. అందరికీ థ్యాంక్స్” అని ఎమోషనల్‌గా చెప్పారు. దీంతో కార్తికేయ ఈ మాటలు చెప్పిన వెంటనే ఆయన తల్లి రమా రాజమౌళి భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడి ఎదుగుదల, అతను ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌ను భుజాన వేసుకుంటున్న తీరు చూసి రమా గారికి ఆనందభాష్పాలు వచ్చినట్లు కార్యక్రమం వద్ద ఉన్న వారు చెబుతున్నారు.
Also Read : Deepika-Prabhas : ప్రభాస్ తో మూవీ అయితే 8 గంటలు.. SRK దగ్గర మాత్రం ఎన్ని గంటలైనా ఓకేనా?
ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. కేఎల్ నారాయణ – కార్తికేయ సంయుక్తంగా శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. రిలీజ్ చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ముఖ్యంగా చివరి షాట్లో నంది వాహనంపై ఉగ్రరూపంలో మహేష్ బాబు కనిపించిన సీన్ ఫ్యాన్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. విజువల్స్, స్కేల్, మ్యూజిక్ అన్నీ కలిపి సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.