వైష్ణవి చైతన్య గతంలో యూట్యూబ్ వెబ్ సిరీస్‌లలో నటించి, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, ‘బేబీ’ సినిమాతో బ్రేక్ అందుకుంది. అయితే, ఆ తర్వాత ఆమె చేసిన ‘లవ్ మీ’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అందులో ఆమె తప్ప ఏమీ లేదు. దర్శకుడు, హీరోతో పాటు ఆమె కూడా తన పాత్రను పోషించింది. ఇటీవల ‘జాక్’ సినిమాలో కూడా ఆమె హీరోయిన్‌గా నటించింది, కానీ ఆ సినిమా కూడా ఆకట్టుకోలేదు. ఎలా అయితే దర్శకుడు, హీరో తమ పాత్రలను సినిమా విషయంలో పోషించారో, వైష్ణవి కూడా అలాగే డైరెక్టర్ చెప్పినట్లు చేసి వచ్చింది. ఆమె పాత్ర పరిమితమే.
Medak: సినిమా రేంజ్ లో.. 19 ఏళ్ళ వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. ఇప్పుడు ఇలా..
డైరెక్టర్ చెప్పినట్లు చేసి రావడం అక్కడి వరకు బాగానే ఉంది. అయితే, ‘జాక్’ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పాటు, కంటెంట్ విషయంలో కంప్లైంట్స్ వస్తూ ఉండడంతో, ఆ ఎఫెక్ట్ వైష్ణవి మీద కూడా పడుతోంది. కొంతమంది, వైష్ణవి కారణంగానే సినిమా ఆడలేదని ఇలాంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ, అక్కడ వైష్ణవి తప్పు ఏమీ లేదు. దర్శకుడు ఏం చెప్పాడో, ఆ పాత్రకు ఎంతవరకు అవసరమో, అంతవరకు ఆమె నటించింది. అంతకుమించి ఆమె చేయడానికి కూడా ఏమీ లేదు. కానీ, కావాలని వైష్ణవిని టార్గెట్ చేసి, ఆమె లెగ్ వల్లే ఇలా జరిగిందని కామెంట్ చేసే వారు కూడా కనిపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, వారే ఆలోచించుకోవాలి.