శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘45’. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నాఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మూవీ టీం అంత పాల్గోన్ని మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ..
Also Read: Vijayashanti : పవన్ సతీమణి మీద వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన విజయశాంతి..
‘ ‘45’ మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఆయన కథ చెప్పేందుకు వచ్చినప్పుడు నేను ఇంట్లో కాజువల్‌గా ఉన్నాను. అది చూసి ఈ మూవీలో నా గెటప్ అలాగే ఉండాలని డైరెక్టర్ చెప్పారు. ఈ చిత్రంలో ఓం సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ను ఎంతో క్రియేటివ్ గా ఈ మూవీలో ఉపయోగించారు అర్జున్ జన్యా. శివరాజ్ కుమార్ గారితో ఓం సినిమా రూపొందించాను. ఆ సినిమా షూటింగ్ రెండో రోజే నేను గొప్ప దర్శకుడిని అవుతానని మీడియా ముందు చెప్పారు. శివన్న అలా చెప్పడం చూసి నేను కంగారుపడ్డాను. లేదు నువ్వు దర్శకుడిగా గొప్ప స్థాయికి వెళ్తావని చెప్పారు. ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. 45 మూవీ స్టోరీ ఏంటి, మా క్యారెక్టర్స్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో క్లాస్, మాస్, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. కూలీ సినిమాలో రజినీకాంత్, నాగార్జున గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. రజినీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని’ అని తెలిపారు. అనంతరం దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ..
‘శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టితో ‘45’ మూవీని చేయడం సంతోషంగా ఉంది. శివరాజ్ కుమార్ గారికి ఆరోగ్యం బాగా లేకున్నా, ఎంతో సపోర్ట్ చేసి సినిమాలో నటించారు. ఉపేంద్ర గారిని ఎలాంటి పాత్రలోనైనా డైరెక్టర్స్ చూపించగలరు. ఆయన దర్శకులకే దర్శకుడు. 45 మూవీని ముందుగా సీజీ, డైలాగ్స్, బీజీఎం తో సహా విజువలైజ్ చేసి, ఆ తర్వాత షూటింగ్ చేశాం. ఈ పద్ధతి వల్ల ఒక్క సీన్ కూడా వేస్టేజ్ ఉండదు , ప్రొడ్యూసర్స్‌కు బడ్జెట్ ఆదా అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా గొప్ప దర్శకులు ఉన్నారు. వారు కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాం. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో స్క్రీన్ ప్లే పరంగా కొత్తదనంతో ఉండే చిత్రమిది. కచ్చితంగా మీకు నచ్చుతుంది’ అని అన్నారు.