కిరణ్ అబ్బవరం హీరోగా, దర్శక ద్వయం సుజిత్, సందీప్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “క”. టైటిల్ తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు కిరణ్ అబ్బవరం. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో రాయలసీమ యాక్షన్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ హీరో స్వయంగా నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్ర ట్రైలర్ ను ఈ నెల 15న అమీర్ పేట AAA మాల్ లో ఉదయం 10గంటలకు నిర్వహించనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణసంస్థ.
అల్లరి నరేశ్ ఈ మధ్య కాలంలో కామెడీ తరహా చిత్రాలకు విరామం ప్రకటించి సీరియస్ కథలను ఎంచుకుంటు హిట్ బాట పడ్డాడు. తాజాగా అల్లరి నరేశ్ “బచ్చలమల్లి” అనే చిత్రం చేస్తున్నాడు. మరో సారి సీరియస్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని అల్లరి నరేశ్ ఫస్ట్ లుక్, గ్లిమ్స్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచాయి. కాగా ‘మా ఉరి జాతరలో’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను జులై 16న 12:06 గంటలకు విడుదల చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించింది యూనిట్.
మంచు విష్ణు హీరోగా రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, తమిళ స్టార్ శరత్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అతిధి పాత్రల్లో మెరవనున్నారు. కాగా నేడు తమిళ స్టార్ శరత్ కుమార్ పుట్టిన రోజు కానుకగా కన్నప్పలో శరత్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు నిర్మాత మంచు విష్ణు. ఇటీవల విడుదలైన కన్నప్ప టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
Also Read: Industry Talk: ఎట్లుండే శంకర్..ఎలా అయ్యాడో..