షణ్ముగం శంకర్ ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండదు. భారీ సినిమాలు, భారీ భారీ సెట్లు, అబ్బో ఒకటేమిటి శంకర్ సినిమా అంటే వింతలు, విశేషాలు ఎన్నో. తమిళ సినిమాని కమర్షియల్ గా ఒక స్థాయిలో నిలబెట్టిన డైరెక్టర్ శంకర్. 80s, 90s లో శంకర్ ప్రభ ఒక రేంజ్ లో వెలిగింది. ప్రశాంత్ లాంటి హీరోతో ఐశ్వర్యరాయ్ జోడిగా జీన్స్ లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి హిట్ కొట్టడం ఆయనకే చెల్లింది. శంకర్, కమల్ కలయికలో వచ్చిన భారతీయుడు రికార్డులు నెలకొల్పింది. అయన సినిమా వస్తోందంటే అటు తమిళ్ తో పాటు తెలుగులోనూ మిగతా సినిమాలు రావడానికి కూడా భయపడే వారు. కానీ ఇదంతా ఒకప్పుడు .
తాజాగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రతీ ఒక్కరు అసలు శంకర్ కు ఏమైంది, ఒకప్పటి ఆ మ్యాజక్ ఎటు పోయిందని ప్రశ్నలు మీద ప్రశ్నలు. వీటికి సమాధానం రైటర్ సుజాత. శంకర్ బిగ్గెస్ట్ హిట్ సినిమాలు భారతీయుడు, ఒకేఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో చిత్రాలకు కథ,స్క్రీన్ ప్లే అందించిన రైటర్ సుజాత. శంకర్, సుజాత కలయికలో వచ్చిన ప్రతి చిత్రం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. కానీ రోబో సినిమా తర్వాత సుజాత మరణించడంతో శంకర్ ప్రభ వైభవం కోల్పోవడం మొదలయింది. సుజాత లేకుండా శంకర్ స్నేహితుడు, విక్రమ్ ఐ, రోబో 2.ఓ, తాజగా భారతీయుడు -2 వచ్చాయి. కానీ ఒక్క సినిమాకూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఒకప్పటి శంకర్ సినిమాలలో ఉండే బలమైన కథ,కధనం ఇప్పుడు ఆయన సినిమాలలో లేవు. ఈ భారీ చిత్రాల దర్శకుడి తదుపరి చిత్రం గేమ్ చేంజర్. రామ్ ఈ చిత్రంతో అయిన శంకర్ సినిమాలకు మునుపటి వైభవం దక్కాలని ప్రతి ఒక్క సినీ అభిమాని కోరుకుంటున్నాడు.
Also Read: Ram potineni: ఆర్టీసీ క్రాస్ రోడ్ లో..మార్ ముంత చోడ్ చింత..