NTV Telugu Site icon

Balakrishna: ఊహించని కాంబినేషన్.. బాలయ్య, రజనీ, శివకుమార్.. బాక్సాఫీస్ బద్దలే

Balakrishna, Rajinikanth ,shivarajkumar

Balakrishna, Rajinikanth ,shivarajkumar

Balakrishna: సౌతిండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ప్రస్తుతం విపరీతంగా చర్చలో ఉన్న అంశం నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ. బాలయ్య బాబు చాలాకాలంగా మల్టీ స్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా ఆయన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్‎తో కలిసి రెండు భాగాలుగా తెరకెక్కే భారీ ప్రాజెక్టు చేయనున్నట్లు ప్రచారం అవుతోంది. ఈ సినిమాను శివరాజ్ కుమార్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుందంటున్నారు. అందులో మొదటి దానిలో బాలయ్యతో పాటు శివరాజ్ కుమార్ కనిపిస్తారట. అలాగే సెకండ్ పార్టులో రజనీకాంత్‎తో కలిసి నటించనున్నారని తెలుస్తోంది. నటసింహంతో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించనున్నారని తెలిసింది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టు సంచలనంగా మారిపోయింది. ముగ్గురు బడా హీరోలు నటిస్తోన్న మల్టీస్టారర్ ప్రాజెక్టు గురించి వైరల్ అవుతుండడంతో దీనికి డైరెక్టర్ ఎవరని అంతా వెతకడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుకు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హర్ష దర్శకత్వం వహిస్తున్నారట.

Read Also: Sarathbabu : శరత్ బాబుకు తలకొరివి పెట్టేది ఎవరో తెలుసా ?

కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్టు చేసి ఆ తర్వాత దర్శకుడిగా మారిన హర్ష.. కన్నడంలో చాలా హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వరుస శివరాజ్ కుమార్ హీరోగా ‘భజరంగీ 2’ ‘వేద’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ సమయంలోనే ఈ మల్టీస్టారర్ కథను చెప్పడం.. ఆ తర్వాత రజినీకాంత్ బాలయ్యను ఒప్పించాడట. ఇక ఈ చిత్రంలో మొదటి భాగంలో శివరాజ్ పాత్ర హైలైట్ కాబోతుందట. క్లైమాక్స్ కు ముందు బాలయ్య ఎంట్రీ ఇస్తారని తెలిసింది. ఇక రెండో పార్టులో వీళ్లిద్దరూ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారంటున్నారు. ఇందులో సెకెండా పార్టులో రజినీకాంత్ పాత్ర ఎంట్రీ ఇస్తుందట. వీళ్లందరి స్క్రీన్ ప్రజెన్స్ను ఓ రేంజ్లో ఎలివేట్ చేసి చూపించబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. రజినీకాంత్ ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఉంటే.. కమల్ హాసన్ మమ్ముట్టి లేదా మోహన్ లాల్ వంటి వారిని తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Read Also:Guyana : స్కూల్ హాస్టల్​లో ప్రమాదం.. 20 మంది పిల్లలు అగ్నికి ఆహుతి