నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయిత్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అమెజాన్ లో విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు రాగా… థియేటర్లలోనే మేకర్స్ సినిమాను రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ‘టక్ జగదీష్’ రూటు మార్చి ఓటిటి విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయనున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందని సమాచారం. ప్రస్తుతం “టక్ జగదీష్”కు సంబంధించిన రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి.
Read Also : “డి44″లో ముగ్గురు భామలతో ధనుష్ రొమాన్స్
ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ‘టక్ జగదీష్’కు థమన్ సంగీతం అందించారు.