నిజం గడప దాటే లోపు, అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని సామెత గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. వాస్తవానికి సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని ఒకరు ఒక వార్త పుట్టించారు. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ లేదు, కానీ దాన్ని రకరకాలుగా వలువలు, చిలువలు చేస్తూ ముందుకు తీసుకు వెళుతున్నారు మరికొందరు. కొందరైతే ఏకంగా సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు రాసేశారు.
Also Read : Bollywood : 68 ఏళ్ల వయసులో కూడా అదరగొడుతున్న స్టార్ హీరో
అయితే, వాస్తవానికి అవేమీ లేవు. అయితే, ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పే విషయంలో ప్రశాంత్ టీం గానీ, ఎన్టీఆర్ టీం గానీ ఎందుకో ఆసక్తి కనబరచడం లేదు. ఇలా అయినా సినిమా గురించి చర్చ జరుగుతుంది అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ, అది ఫ్యూచర్ లో సినిమాకి ఇబ్బంది కలిగించే అంశమే. కాబట్టి, ఈ విషయంలో ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ లేదా ప్రశాంత్ నీల్ టీమ్స్ ముందుకు వచ్చి కొంతవరకు క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వినిపిస్తోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ‘డ్రాగన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాని హోంబాలే ఫిలిమ్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.