నిజం గడప దాటే లోపు, అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని సామెత గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. వాస్తవానికి సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని ఒకరు ఒక వార్త పుట్టించారు. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ లేదు, కానీ దాన్ని రకరకాలుగా వలువలు, చిలువలు చేస్తూ ముందుకు తీసుకు వెళుతున్నారు…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ‘డ్రాగన్’. ఈ మూవీ పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నా ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో వస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో క్రేజీ ఎక్సైట్‌మెంట్ పెరిగిపోయింది. ఇటీవల ఎన్టీఆర్ లూక్ కూడా అందరిని షాక్ కి గురిచేసింది, లీన్ బాడీ, పుల్ గడ్డం…