Trivikram Srinivas: ఆ హీరోయిన్ కాళ్లపై పడ్డారా? గురూజీ అదిరిపోయే క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram Srinivas: తెలుగు చిత్రసీమలో తనదైన పదునైన సంభాషణలు, హుందాతనంతో ‘గురూజీ’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏకంగా ఓ హీరోయిన్ కాళ్లపై పడ్డారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడిచింది. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ వేదికపై చోటుచేసుకున్న ఈ వింత సన్నివేశం ఇంటర్నెట్ను షేక్ చేసింది. వేదికపైకి రాగానే హీరోయిన్ శ్రీనిధి శెట్టి ముందు త్రివిక్రమ్ వంగి కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం కెమెరాల్లో రికార్డ్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ రచ్చపై తాజాగా జరిగిన మీడియా సమావేశంలో త్రివిక్రమ్ స్వయంగా స్పందించి, అదిరిపోయే రీతిలో అసలు నిజాన్ని తేటతెల్లం చేశారు.
ప్రెస్ మీట్లో ఓ జర్నలిస్ట్ నేరుగా ఈ ప్రస్తావన తీసుకురాగా, త్రివిక్రమ్ ఏమాత్రం తడుముకోకుండా నవ్వుతూ సమాధానమిచ్చారు. “నేను నా కెరీర్లో ఎంతోమంది హీరోయిన్స్‌తో పనిచేశాను. కానీ శ్రీనిధి శెట్టి వారందరికంటే చాలా డిఫరెంట్. ఆమె ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. షూటింగ్ మొదలైన కొద్దిరోజులకే మా యూనిట్‌తో ఒక కుటుంబ సభ్యురాలిలా ఇట్టే కలిసిపోయింది. మనకు అత్యంత సన్నిహితమైన స్నేహితులతో సరదాగా ఆటపట్టించే అలవాటు ఉంటుంది కదా.. వేదికపై ఆమెను అలా ఆటపట్టించడానికే సరదాగా కాళ్లకు దండం పెట్టినట్లు యాక్ట్ చేశాను తప్ప, అందులో ఎలాంటి ఉద్దేశం లేదు” అంటూ గురూజీ కూల్‌గా ముగించారు.
Also Read
- Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్‌కు రండి..
- Dasharatha Madhav: ఐఐటీ ర్యాంక్.. గోల్డ్ మెడల్.. టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. చివరకు నటుడిగా!
- Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
స్టార్ దర్శకుడు ఓ యంగ్ హీరోయిన్ కాళ్లకు మొక్కడం ఏంటంటూ రకరకాల ఊహాగానాలు, గాసిప్పులు అల్లిన వారికి త్రివిక్రమ్ చెప్పిన ఈ సమాధానంతో నోళ్లు మూతపడ్డాయి. తమ మధ్య ఉన్న బాండింగ్, స్నేహపూర్వక వాతావరణం వల్లే అంత పెద్ద స్టేజ్ మీద కూడా సరదాగా అలా టీజ్ చేయగలిగామని ఆయన స్పష్టం చేయడంతో ఆ వీడియో వెనుక ఉన్న అసలు మిస్టరీ వీడిపోయింది. గురూజీ ఇచ్చిన ఈ క్లారిటీతో రూమర్లకు తెరపడటమే కాకుండా, ఆయన వేసిన ఈ సరదా పంచ్ ఇప్పుడు నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
Trivikram Srinivas: ఆ హీరోయిన్ కాళ్లపై పడ్డారా? గురూజీ అదిరిపోయే క్లారిటీ!
-
Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
-
Rahul Gandhi: ‘లాఠీలకు భయపడొద్దు’.. నవంబర్ 1 మార్చ్‌కు వెనక్కి తగ్గేదేలేదు..
-
Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్‌కు రండి..
-
Dinesh Karthik: విరాట్, రోహిత్ కాదు… ఈ భారత యువ సంచలనమే వరల్డ్ బెస్ట్ ఓపెనర్..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..