Trisha Krishnan: అతడు సినిమాలో పూరీ అనే పేరుతో అందరిని ఆకట్టుకున్న త్రిష క్రిష్ణన్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా పొన్నియన్ సెల్వన్ లో తన నటనతో ఆకట్టుకుంది త్రిష. ఒక సక్సెస్ వస్తే హీరో హీరోయిన్లు ముందుగా చేసే పని పారితోషికం పెంచడమే. అయితే.. ఈ విషయంలో నటి త్రిష ఫాస్ట్‌గా ఉంటుందని దానికి ఉదాహరణ తాజా పరిణామాలే. త్రిష 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈభామ 23 ఏళ్లుగా కథానాయికగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా.. పలు విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. త్రిష నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు ఒకటి కూడా సక్సెస్ కాలేదు. త్రిష సరైన హిట్ చూసి ఐదేళ్లు దాటింది.. 2018 తర్వాత త్రిష నటించిన ఒక చిత్రం కూడా సక్సెస్ కాకపోవడంతో.. త్రిషకు పే డౌట్ నటి అనే ముద్రవేశారు.
Read also: AP Formation Day Cm Jagan Live: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం లైవ్
అలాంటి తరుణంలో దర్శకుడు మణిరత్నం పుణ్యమా అంటూ సక్సెస్‌తో పాటు మంచి పేరు వచ్చేశాయి.. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవైగా నటి త్రిష చాలా హుందాగా నటించడంతో.. ఈమెకు ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా.. నత్తనడక నడుస్తున్న త్రిష సినీ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్‌లో పరిగెడుతోంది. దీంతో.. భారీ అవకాశాలు త్రిష తలుపు తడుతున్నాయి. ఇంకేముంది ఈ బ్యూటీ ఒకసారిగా పారితోషికం పెంచేసినట్లు ప్రచారం జరుగుతుంది… ఇప్పటివరకు రూ.కోటిన్నర దాటని పారితోషికాన్ని ఇప్పుడు డబుల్ చేసినట్లు సినీవర్గాల టాక్. ఇక..ప్రస్తుతం ఈమె నటిస్తున్నది రోడ్ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది, త్వరలో.. దళపతి విజయ్‌కి జంటగా ఒక చిత్రంలోనూ, అజిత్ సరసన ఒక చిత్రంలోని నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Russia-Ukraine War: అందుకే ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్స్‌పై దాడి చేస్తున్నామన్న పుతిన్