Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?
- త్రిష కృష్ణన్ అభిమానులకు షాకింగ్ న్యూస్
- దళపతి విజయ్ దారిలో త్రిష?
- త్రిష చేతిలో విశ్వంభర, కరుప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన హీరోయిన్ త్రిష కృష్ణన్.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవల తమిళ్ అగ్ర హీరో దళపతి విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే తన భర్త ఒక నటితో సంబంధం పెట్టుకోవడమే తాను విడాకులు కోరడానికి కారణం అని సంగీత చెప్పడం సంచలనంగా మారింది. ఇదే సమయంలో విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో పాల్గొనడం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. ఈ విషయంలో కోలీవుడ్‌లో వాడివేడిగా చర్చ జరుగుతోంది.
అయితే తాజాగా త్రిషకు సంబంధించిన మరో వార్త ఆమె అభిమానులకు షాక్ ఇచ్చేలా ఉందనే చెప్పాలి. ఇకపై త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టుగా తెలుస్తోంది. అందుకే గత కొంతకాలంగా ఆమె కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. చెన్నై బ్యూటీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిజానికి ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ విజయంతో హీరోయిన్గా త్రిష మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం అమ్మడి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉందనే చెప్పాలి. ఇలాంటి సమయంలో విజయ్ వ్యవహారంతో పాటు రాజకీయంగా కూడా హాట్ టాపిక్‌గా మారారు.
Also Read
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
Also Read: Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!
ఇప్పటికే దళపతి విజయ్ నటనకు స్వస్తి చెప్పి.. ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అనే పార్టీ స్థాపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే అయన టార్గెట్. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేయనుంది. ఇప్పుడు త్రిష టీవీకే పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగులో మెగాస్టార్ ‘విశ్వంభర’తో పాటు తమిళ్లో సూర్య ‘కరుప్పు’ సినిమాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!