నూతన దర్శకుడు విరాట్ చక్రవర్తి తెరకెక్కిస్తున్న చిత్రం “100 క్రోర్స్”. రాహుల్, చేతన్, అమీ, సాక్షి చౌదరి, ఐశ్వర్య, ఇంటూరి వాసు, సమీర్, భద్రామ్, శేషు, శరత్ లోహిత్స్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ స్టూడియో & విజన్ సినిమాస్ బ్యానర్లపై కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన టీజర్ ను నేడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. మూవీ టీజర్ పై ప్రశంసలు కురిపించిన అనిల్ రావిపూడి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.
Read Also : మల్టీలింగ్వల్ మూవీలో సంజనా గల్రానీ!
2016లో మోడీ ప్రకటించిన నోట్ల రద్దు వీడియోతో టీజర్ మొదలవుతుంది. అదే రోజు రాత్రి ఊరి చివర పెద్ద ఎత్తున డబ్బును తగలబెట్టేయడం, ఆ తరువాత పెద్ద ఎత్తున ఉన్న మనీ వ్యాన్ ఛేజింగ్, ఆ డబ్బును ఎవరో కొట్టేయడం సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. ఇక చివర్లో వచ్చిన మాస్క్ ఎవరిది? అతను ఎవరు ? ఆ డబ్బును అతనే కొట్టేశాడా ? అనే అనుమానాలు రేకెత్తిస్తోంది టీజర్. ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.