టాలీవుడ్‌లో తండ్రి పాత్ర చుట్టూ తిరిగే సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి రియల్ హీరో. కుటుంబాన్ని నడిపించేది, ఎలాంటి లోటు లేకుండా చూసుకునేది తండ్రి మాత్రమే. అలాంటి తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. మరి ఇప్పటి వరకు తండ్రి ప్రేమను తెలియజేసే టాలీవుడ్ బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.సూర్య వంశం (1998)
వెంకటేష్ ద్విపాత్రాభినయంతో వచ్చిన ఈ చిత్రంలో తండ్రి మనస్సు దోచుకునే కొడుకు పాత్రను వెంకటేష్ అద్భుతంగా పోషించారు. తండ్రి ఇష్టం లేని కొడుకు ఎలా తన ప్రేమను పొందాడో చూపిస్తూ, తండ్రి సెంటిమెంట్‌కు నిండి ఉండే చిత్రం.
2. డాడీ (2001)
ఈ చిత్రంలో చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించారు. కూతురి కోసం పరితపించే తండ్రిగా మెగాస్టార్ నటన ఎంతో ఆకట్టుకుంటుంది. ఇప్పటికి ఈ మూవీ టీవిలో వస్తే యాడ్ కూడా తిప్పకుండా చూస్తారు.
3. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
వెంకటేష్, మహేష్ బాబు మల్టీస్టారర్ ఈ కుటుంబ కథా చిత్రంలో తండ్రిని గౌరవించే సంస్కారం, అన్నదమ్ముల బంధం ఎమోషనల్‌గా నడిచే ప్యాకేజీ. వెంకటేష్ తన పాత్ర ద్వారా పెద్ద అన్నగా తండ్రి స్థానంలో మానవతను ప్రతిబింబించారు.
4. జెర్సీ (2019)
నాని ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా తండ్రి–కొడుకు మధ్య బంధాన్ని చూపింది. తన కొడుకు గర్వపడేలా జీవించాలనే తండ్రి త్యాగాన్ని హృద్యంగా ప్రజెంట్ చేసింది. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు కన్నీళ్లు తెప్పించేలా ఉంటాయి.
5. శతమానం భవతి (2017)
ప్రకాశ్ రాజ్ తండ్రిగా తన పిల్లలంతా ఒక చోట కలిసి ఉండాలని కోరుకునే సున్నితమైన కథ. కుటుంబ విలువల పరిరక్షణ కోసం తండ్రి చేసే ప్రయత్నాలు ఎంతో బలంగా కనిపిస్తాయి.
6.బొమ్మరిల్లు (2006)
సిద్దార్థ్ నటించిన ఈ చిత్రంలో తండ్రిగా ప్రకాశ్ రాజ్ పాత్ర ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉండడం, కొడుకు వ్యక్తిత్వ అభివృద్ధికి అడ్డుగా మారడం వంటి విషయాలపై చక్కటి చిత్రణ. తండ్రీ-కొడుకుల మధ్య చివర్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ హైలైట్.
7. నాన్నకు ప్రేమతో(2016)
ఎన్టీఆర్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్‌తో తండ్రి కొడుకుల బంధాన్ని ఆసక్తికరంగా చూపించారు. తండ్రి పేరు కోల్పోకూడదనే సంకల్పంతో కొడుకు చేసే పోరాటం, ప్రేమ, పాపులారిటీకి మించి కుటుంబ విలువలు ఏమిటో తెలిపే సినిమా.
8. హాయ్ నాన్న (2023)
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన ఈ చిత్రం తండ్రి–కూతురు మధ్య నిగూఢమైన అనుబంధాన్ని చూపించింది. తండ్రిగా అనారోగ్యంతో బాధపడుతున్న కూతురిని కాపాడేందుకు నాని పోరాడే కథ. భావోద్వేగాలు ప్రధానమైన క్లైమాక్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
9.సన్నాఫ్ సత్యమూర్తి(2015)
అల్లు అర్జున్ తండ్రి గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆస్తి త్యాగం చేయడాన్ని అర్థవంతంగా చూపించే చిత్రమిది. ఒక తండ్రి ఆచారాలను, విలువలను జీవితంలో ఎలా ఆచరిస్తారో బన్ని క్యారెక్టర్ ద్వారా చెప్పబడింది.
10. దృశ్యం (2014), దృశ్యం 2 (2021)
వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ రెండు చిత్రాలు ఫాదర్ సెంటిమెంట్‌కు తలమానికాలు. ఒక తండ్రి తన కుటుంబాన్ని కాపాడటానికి ఎంతవరకైనా వెళ్తాడు అనే పాయింట్‌తో కథ అల్లబడింది. వెంకటేష్ నటన ఈ చిత్రానికి చక్కటి బలం.
ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగులో తండ్రి సెంటిమెంట్ మీద చాలా సినిమాలు ఉన్నాయి..