వినాయక చవితి కానుకగా విషెస్ తెలుపుతూ షూటింగ్ దశలో ఉన్న సినిమాలు పోస్టర్స్ రిలీజ్ చేయగా, యంగ్ హీరోలు తమ నూతన సినిమాలను ప్రకటించారు మేకర్స్. అవేంటో ఒకేసారి చూసేద్దాం పదండి..
1 – వినాయక చవితి కానుకగా తన నెక్ట్స్ సినిమాలను ప్రకటించాడు శర్వానంద్. ఈ నెల శర్వా 37 సినిమా లో హీరోయిన్ సంయుక్త మీనన్ పోస్టర్ ఈ నెల 11న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ .
2 – మత్తువదలరా – 2 సినిమా సెన్సార్ సభ్యుల నుండి U/A సర్టిఫికెట్ అందుకుంది. ఈ నెల 13న రిలీజ్ కానుంది ఈ చిత్రం
3 – చిన్నసినిమాగా రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు భారీ కలెక్షన్స్ రాబట్టి 5వ వారంలోకి అడుగుపెట్టి థియేటర్స్ లో రన్ అవుతోంది
4 – నార్నె నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ ఈ నెల 12 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది
5 – దేవర సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ను ముందుగా రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా సినిమాలోనే చూపించాలని భావిస్తున్నారట మేకర్స్
6 – సుహాస్ హీరోగా తెరకెక్కిన జనక అయితే గనుక పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను అక్టోబర్ లో దసరాకు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు
7 – ఇటీవల రిలీజ్ ఆయిన దేవరలోని దావూదీ సాంగ్ సినిమాలో ఉండదని రోలింగ్ టైటిల్స్ లో వస్తుందని తెలుస్తోంది.